‘ఆ సింగర్ ఓ కామాంధుడు, నన్నూ వదిలిపెట్టలేదు’

ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ అను మాలిక్‌ గురించి మరో షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇటీవల గాయని సోనా మొహాపాత్ర అతనిపై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అనే మరో పాపులర్ సింగర్ అను తనతో ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో బట్టబయలు చేసింది. అతడు కామాంధుడంటూ తిట్టిపోసింది.

‘నువ్వు చెప్పింది నిజమే సోనా. అను మాలిక్ ఓ కామాంధుడు. వాడు నన్ను కూడా వదిలిపెట్టలేదు. 21 ఏళ్ల వయసులో నేను అను మాలిక్ స్టూడియో‌కి వెళ్లాను. నేను పాడిన పాటల సీడీ ఆయనకు చూపిస్తే నచ్చి నాకు ఛాన్స్ ఇస్తాడనుకున్నా. కానీ ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తాడని అస్సలు ఊహించలేదు. ఆ సమయంలో అతను సోఫాలో కూర్చుని నా కళ్లను పొగుడుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నాకు భయమేసి కింద మా అమ్మ ఎదురుచూస్తోంది సర్ అని వెళ్లిపోయాను. ఆ తర్వాత అను నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు చేశాడు. కానీ నేను స్పందించలేదు. నాకంటే వయసులో పెద్దవాడైన అతను ఇలా ప్రవర్తించడం ఎంత వరకు కరెక్ట్? వాడు మళ్లీ టీవీలో ఎలా కనిపిస్తున్నాడో నాకు అర్థంకావడంలేదు. ఈ నిజాలన్నీ బయటపట్టాక నాకు ఏం జరిగినా ఫర్వాలేదు. ఎన్ని సార్లు తప్పించుకున్నా నిజం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

అయితే ప్రముఖ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొన్న ఓ సింగర్ చాలా బాగా పాటలు పాడుతున్నాడని ప్రముక లెజండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మెచ్చుకున్నాడు. దాంతో సోనా మొహాపాత్ర ఆయన్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. ‘సచిన్ సర్.. మీకు మీటూ గురించి ఏమీ తెలీదా? మీరు మెచ్చుకుంటున్న షోలో అను మాలిక్ అనే కామాంధుడు ఉన్నాడు. మీరు ఎప్పుడూ ఆ షోలో పాల్గొనేవారినే మెచ్చుకుంటారా? అను మాలిక్ వల్ల మాలాగా ఇబ్బందులు పడిన ఆడవాళ్ల గురించి అస్సలు పట్టించుకోరా?’ అని ప్రశ్నించింది సోనా. అయితే ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో సచిన్ మాత్రం దీనిపై స్పందించలేదు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.