ఆ వార్త తెలియగానే షాక్‌కు గురయ్యాను: బాలకృష్ణ

సీనియర్ నటి గీతాంజలి మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణ వార్త తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. తమ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరని తెలిపారు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఆమెకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు.

‘‘గీతాంజలి గారు పరమపదించారినే వార్త తెలియగానే షాక్‌ అయ్యాను. ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారు. మా కుటుంబంతో మంచి అనుబంధం ఉన్న వారిలో ఆవిడ ఒకరు. నాన్నగారంటే ఆవిడకు ఎంతో అభిమానం. నాన్నగారు డైరెక్ట్‌ చేసిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో సీత పాత్రలో గీతాంజలిగారు నటించారు. నటనలో ఆవిడ నాన్నగారిని ఎప్పుడూ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. తెలుగు సినిమాల్లో నటిగా తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప నటి మనల్ని విడిచిపెట్టి పోవడం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. ఆమె కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యానివ్వాలని ప్రార్ధిస్తున్నాను’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Also Read:

కాగా, గీతాంజలి గుండెపోటుతో గురువారం ఉదయం మృతిచెందారు. ప్రస్తుతం ఆమె వయసు 72 సంవత్సరాలు. 1947లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి అసలు పేరు మణి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి 500పైగా చిత్రాల్లో గీతాంజలి నటించారు. సీనియర్ హీరో రామకృష్ణను గీతాంజలి వివాహం చేసుకున్నారు. ఆమె తెలుగులో ఆఖరిగా నటించిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.