ఆర్టీసీ సమ్మె: కార్మికుడికి గుండెపోటు.. మనస్తాపంతో మరో కార్మికుడి మృతి

ర్టీసీలో అకాల మరణాలు కొనసాగుతున్నాయి. సమ్మె నేపథ్యంలో మనస్తాపానికి గురై జిల్లాలో ఓ కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆందోల్ మండలం జోగిపేటకు చెందిన నాగేశ్వర్ (42) అనే కార్మికుడు ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరితో మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కొద్ది రోజులుగా అన్యమనస్కంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం (నవంబర్ 14) మృతి చెందాడు.

ఆర్టీసీలో నాగేశ్వర్ మూడేళ్ల కిందటే రెగ్యులర్ ఉద్యోగిగా బాధ్యతలు స్వీకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిహారం డిమాండ్ చేస్తూ అతడి కుటుంబ సభ్యులు నారాయణ్‌ఖేడ్ డిపో వద్ద నిరసనకు దిగారు. డిపో మేనేజర్ ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. న్యాయం చేసేంతవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని వారు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Also Read:

నేపథ్యంలో మనస్తాపానికి గురైన మరో కార్మికుడు సమ్మయ్య గుండెపోటుకు గురయ్యాడు. అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఖమ్మంపల్లి మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య మంథని డిపోలో కండక్టర్‌గా ఉన్నాడు. సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో అతడు మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గుండెపోటుకు గురయ్యాడని చెప్పారు.

మరోవైపు.. ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం (నవంబర్ 14)తో 41వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలో సుదీర్ఘ సమ్మె ఇదే కావడం గమనార్హం. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కార్‌లో చలనం లేకపోవడంతో కార్మికులు అసహనానికి గురవుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించడంలేదని మనోవేదనకు గురవుతున్నారు.

Must Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.