ఆర్టీసీ డ్రైవర్ మృతదేహం వద్ద బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిరసన.. తీవ్ర ఉద్రిక్తత

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, ఎంపీ ఘాటు విమర్శలు చేశారు. ఆర్టీసీ కార్మికుల చావులు కేసీఆర్ చేసిన హత్యలేనని వ్యాఖ్యానించారు. గురువారం (అక్టోబర్ 31) ఆయన గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు మృతదేహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చర్చలు జరిపే వరకు బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఎంపీ డిమాండ్‌కు బాబు కుటుంబసభ్యులతో పాటు కార్మిక సంఘాలు కూడా మద్దతు పలికాయి. వారంతా బాబు నివాసం ఎదుట బైఠాయించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె వల్లే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళనకారులు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులను ఘెరావ్ చేశారు. దీంతో డ్రైవర్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Must Read:

అంతకుముందు మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని.. కేసీఆర్ రాక్షసుడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రుల పైనా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులు బ్రోకర్లు.. జోకర్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు.

Also Read:

కరీంనగర్ 2 డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నగునూరి బాబు బుధవారం మధ్యాహ్నం గుండెపోటుకు గురై మరణించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు సరూర్‌నగర్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘సకల జనుల సమరభేరి’లో పాల్గొన్న బాబు.. గుండెపోటుతో కుప్పకూలాడు. తోటి కార్మికులు వెంటనే అతడిని సమీపంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బాబు అంత్యక్రియలు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.