ఆర్టికల్ 370 రద్దుతో ఇండియన్ బిస్మార్క్ సర్దార్ పటేల్ కల సాకారమైందా?

స్వాతంత్ర భారత భారత తొలి ఉప ప్రధాని, హోమ్ మంత్రి బర్డోలీ వీరుడు . స్వాతంత్ర అనంతరం దేశంలో ఏర్పడ్డ అనిశ్చితిని, అనైక్యతను తన చతురతతో పటేల్ పరిష్కరించారు. తొలి నుంచి విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన అఖండ భారతావనిని రెండు ముక్కలుగా చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్‌లో విలీనం కావచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు.

మీరు భారత్‌లో లేదా… పాకిస్థాన్‌లో విలీనం కావచ్చే లేదంటే మీకు మీరు సొంతంగా రాజ్యాలు ఏలుకోవచ్చు’ అనే స్వేచ్ఛను ఇచ్చారు. దీంతో సంస్థానాధీశులకు ఎక్కడలేని శక్తివచ్చింది. ఎవరికివారు జెండా ఎగరేయడం మొదలుపెట్టారు. అన్నింటికీ మించి హైదరాబాద్‌, జూనాగఢ్‌, కశ్మీర్‌ లాంటి కీలక సంస్థానాలపై పాకిస్థాన్‌ కన్నేసింది. ఒకవేళ అవి పాక్‌లో కలిసిపోతే నిత్యం అశాంతి, అస్థిరత, ఘర్షణే. ఒకే ఇల్లులా ఉండాల్సిన దేశంలో ఇన్ని వేరు కుంపట్ల మంటలు భరించాలా? ఇలా కుదరదు.. పిల్ల రాజ్యాలన్నింటి తల్లి భారతి ఒడిలో చేర్చాలి… దేశమంతా ఒక్కటిగా ఉండాలి.. ఇందుకు ఉక్కు సంకల్పం కావాలి.. అలా సంస్థానాలను దేశంలో విలీనం చేసే బాధ్యతను ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వీకరించారు. దీనికోసం ప్రత్యేకంగా కేంద్రంల ‘రాష్ట్రాల శాఖ’ ఏర్పాటైంది.

ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్‌గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిందో భారత యూనియన్‌లో స్వదేశీ సంస్థానాలు వీలినంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది.

1947లో స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరుతుగా ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్‌లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనుకుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్‌ను స్వంతంత్ర రాజ్యంగా ఉంచాలనే బలీయమైన కోరిక ఆయనది.

స్వాతంత్రం ఆనంతరం మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తానని ఏడో నిజామ్ ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరిపట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు అంగీకరించలేదు. ఇదే సమయంలో నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాన్ని సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడానికి ఇదే సరైన సమయంగా పటేల్ భావించారు. ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13 న ప్రారంభమైన ఆపరేషన్ మూడు రోజులు పాటు కొనసాగి అదే నెల 17 న ముగిసింది.

సైనికచర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీచేశారు. కశ్మీర్‌ది మరో విచిత్రమైన పరిస్థితి. ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్‌లో కశ్మీర్‌ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. అ

అయితే దాయాది పాకిస్థాన్ కశ్మీర్‌లోని వేర్పాటువాదులను ప్రోత్సహించిన దీన్ని వ్యతిరేకించేలా చేసింది. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా నాటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దీనికి ఒప్పుకోలేదు. అప్పుడే పుట్టుకొచ్చింది , 35ఎ. దాదాపు 75 ఏళ్లుగా రావణకష్టానికి ఆజ్యం పోసింది. తాజాగా, మోదీ ప్రభుత్వం దీనిపై సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి పూర్తిగా భారత్‌లో విలీనం చేసింది. అయితే, ఇక్కడితో సమస్య పరిష్కారం కాలేదు. దశాబ్దాలుగా సాగుతోన్న వివాదం పరిష్కారమై కశ్మీర్‌లో శాంతియుత వాతావరణం ఏర్పడాలంటే మరికొన్నేళ్లు వేచిచూడక తప్పని పరిస్థితి.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.