అల్లు అర్జున్, సుకుమార్ సినిమా ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో సుకుమార్, అల్లు అర్జున్ సినిమా తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది బన్నీకి 20వ సినిమా. అయితే, ఈ సినిమాను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు.

హైదరాబాద్‌లోని మైత్రీ మూవీస్ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మరో దర్శకుడు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్‌ను చిత్ర యూనిట్‌కు అందజేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించనుంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. నాని ‘గ్యాంగ్ లీడర్‌’కు కెమెరామెన్‌గా పనిచేసిన మిరోస్లావ్ కూబా బ్రోజెక్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

కాగా, ప్రస్తుతం ‘అల… వైకుంఠపురములో…’ సినిమాతో బన్నీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోనన సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. పాటలు చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ‘అల… వైకుంఠపురములో…’ టీజర్‌ను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.