అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతుంటే తిట్టాడని… భర్త గొంతు నులిమి చంపేసిన భార్య

అర్ధరాత్రి ఫోన్ మాట్లాడుతుండగా కోప్పడ్డాడని ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చింది. క్షణికావేశంలో ఆమె చేసిన పనితో ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

Also Read:

ఔరంగాబాద్‌ జిల్లాలోని రిషియక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సర్సా గ్రామంలో అనిల్‌సింగ్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అతడి భార్యతో ఎవరితోనే ఫోన్లో మాట్లాడటం చూసి అనిల్ నిలదీశాడు. అర్ధరాత్రి వేళ ఎవరితో మాట్లాడుతున్నావంటూ గొడవ పెట్టుకున్నాడు. దీంతో భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాసేపటి తర్వాత అనిల్ మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు.

Also Read:

దీంతో అతడి భార్య చున్నీతో అనిల్ గొంతు నులిమి చంపేసింది. దీనిపై అనిల్ బంధువు విజయ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి తన భర్త భోజనం చేసి పడుకున్నాడని, ఉదయం తాను నిద్రలేపగా లేవలేదని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే అనిల్ మెడపై గొంతు బిగించిన ఆనవాళ్లు గమనించిన పోలీసులు ఆమెను గట్టిగా నిలదీయగా నేరం ఒప్పుకుంది. అర్ధరాత్రి వేళ తాను ఫోన్ మాట్లాడుతుండగా భర్త కోప్పడ్డాడని, అందుకే కోపంతో చంపేశానని తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.