అది చూసే నా భర్త నాకు పడిపోయాడు: ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ పర్సనల్, ప్రొఫెషలన్ లైఫ్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ గాయకులు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 1న వీరిద్దరూ తొలి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా తనలో అందం కాకుండా ఇంకేం చూసి నిక్ పడిపోయాడో ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

‘పెళ్లయ్యాక ప్రొఫెషనల్ లైఫ్‌ని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ అర్థం చేసుకునే భర్త వచ్చాడు కాబట్టి నేనెంతో లక్కీ. చెప్పాలంటే నా పనిపై నాకున్న గౌరవం చూసే నిక్ నాకు పడిపోయాడు. మా ఇద్దరికీ ప్రొఫెషనల్ జీవితాలు ఎంతో ముఖ్యం. ఎందుకంటే మేమిద్దరం సొంతంగా ఎంటర్‌టైన్‌మెంట్ కెరీర్‌ను ఎంచుకున్నాం. మాకెవ్వరూ సాయం చేయలేదు. మా కాళ్లపై మేం నిలబడ్డాం. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాం. మా ఇద్దరికీ ఇండస్ట్రీలో 10 ఏళ్ల సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉంది. ఈ స్థాయికి రావడానికి మేం ఏం కోల్పోయామో మాకే తెలుసు. అందుకే ప్రొఫెషన్ పరంగా ఇద్దరం ఒకర్నొకరం బాగా సపోర్ట్ చేసుకుంటాం. మేమిద్దరం ఓ రూల్ పెట్టుకున్నాం. మూడు వారాలకు మించి ఒకరినొకరు చూసుకోకుండా ఉండకూడదు’

‘అందుకే ప్రపంచంలో ఏ మూలనున్నా రోజూ వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో రిలేషన్‌‌షిప్‌లో ఉన్న చాలా మంది కేవలం పనిపైనే ఫోకస్ చేస్తున్నారు. దాంతో వారి ప్రేమను, వైవాహిక జీవితాన్ని కోల్పోతున్నారు. ఎక్కువగా పనిపై ఫోకస్ చేయడం వల్లే విడిపోతున్నాం అని చెబుతుంటారు. అందులో లాజిక్ లేదు. ఒకరికోసం ఒకరు అనుకున్నప్పుడు జీవితంలో ఎంత బిజీగా ఉన్నా వారి కోసం కాస్తైనా సమయం కేటాయిస్తాం. మా గురించి ప్రజలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. అసలు వారి గురించి ఆలోచించను కూడా. వారి నోరు వారి ఇష్టం. జీవితంలో నేను చేసిన మంచి పనుల్లో నిక్‌ని పెళ్లి చేసుకోవడం ఒకటి. మా ఇద్దరికీ పెళ్లై ఏడాది కావొస్తోంది. నా వెన్నంటే ఉంటూ నన్ను సంతోషపెట్టే వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఉన్నతంగా మరింత ఎదగడానికి నిక్ నాకు కొత్త రెక్కల్ని ఇచ్చాడు’ అని వెల్లడించారు ప్రియాంక.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.