UGC NET – 2019 హాల్‌టికెట్లు విడుదల

దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం నిర్వహించనున్న
యూజీసీ నెట్ (డిసెంబరు) – 2019 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను నవంబరు 10 విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. యూజీసీనెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

Dont Miss:

పరీక్ష విధానం..
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది.

✦ పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

✦ ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.

✦ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also:

ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.10.2019 (పొడిగించిన తేది: 15.10.2019)

✦ ఫీజు చెెల్లించడానికి చివరితేది: 10.10.2019 (పొడిగించిన తేది: 16.10.2019)

✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 – 25.10.2019 వరకు.

✦ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019

✦ నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 – 6 వరకు.

✦ ఫలితాల వెల్లడి: 31.12.2019


Read More..

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.