Today Petrol Price: ఓరినాయనో.. రూ.80కు పెట్రోల్ ధర..!

దేశీ ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి. లీటరుకు 15 పైసలు, 10 పైసలు చొప్పున పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.80 దగ్గరికి చేరింది. రూ. రూ.79.02కు పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.73.29కు చేరింది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.78.69కు చేరింది. డీజిల్‌ ధర కూడా 10 పైసలు పెరుగుదలతో రూ.72.62కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 16 పైసలు పెరుగుదలతో రూ.78.32కు చేరింది. డీజిల్ ధర కూడా 11 పైసలు పెరుగుదలతో రూ.72.28కు ఎగసింది.

Also Read:

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.74.34కు చేరింది. డీజిల్ ధర కూడా 10 పైసలు పెరుగుదలతో రూ.67.24కు ఎగసింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.80.00కు చేరింది. డీజిల్ ధర కూడా 11 పైసలు పెరుగుదలతో రూ.70.55కు ఎగసింది.

Also Read:

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.83 శాతం తగ్గుదలతో 61.23 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.39 శాతం తగ్గుదలతో 56.19కు దిగొచ్చింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.