Manish Pandey: కొన్ని గంటల్లో పెళ్లి.. జోష్‌లో స్టేడియం వెలుపలికి సిక్సర్

భారత క్రికెటర్ కొట్టిన ఓ సిక్సర్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆదివారం (డిసెంబర్1) తమిళనాడుతో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కర్ణాటక కెప్టెన్ హోదాలో మనీశ్ జట్టును ముందుండి నడిపించాడు. 39 పరుగులకు రెండు వికెట్లు పడిపోయిన వేళ.. క్రీజులోకి వచ్చిన తను అజేయ అర్ధసెంచరీ (45 బంతుల్లో 60 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రత్యర్థికి పోటీనివ్వగలిగే రీతిలో 180/5ను కర్ణాటక సాధించింది. అనంతరం ఛేజింగ్‌లో ఓవర్లన్నీ ఆడిన తమిళటీమ్.. 179/6కు పరిమితమై ఒక్కరన్ తేడాతో పరాజయం పాలైంది. గతేడాది టోర్నీ నెగ్గిన కర్ణాటక డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగి ఈసారి కూడా విజేతగా నిలవడం విశేషం.

Read Also:

అయితే ఈ మ్యాచ్‌లో మనీశ్ కొట్టిన సిక్సర్ ట్రోఫీకే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో తమిళబౌలర్ మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో అతని తలమీదుగానే కొట్టిన షాట్ ఏకంగా స్టేడియం వెలువల పడింది. అప్పుడే బౌలింగ్‌కు వచ్చిన మురుగన్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహంతో ముందుకొచ్చి ఆడిన లాఫ్టెడ్ షాట్‌తో కన్నడ టీమ్‌కు ఆరు పరుగులు సమకూరాయి. మరోవైపు మైదానం ఆవతల బంతి పడడంతో మరో కొత్త బంతిని తెప్పించి ఇన్నింగ్స్‌ను కొనసాగించారు.

Read Also:

మరోవైపు మనీశ్ సోమవారం ఒక ఇంటివాడు కాబోతున్నాడు. కన్నడ నటి ఆశ్రితా షెట్టిని సోమవారం (డిసెంబర్ 2) వివాహం చేసుకోబోతున్నాడు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ ముగిశాక తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. సోమవారం పెళ్లి చేసుకుంటున్నానని, జీవితం ఆనందంగా సాగాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. హీరో సిద్ధార్థ్‌తో అశ్రిత నటించిన ఎన్‌హెచ్ 4 అనే సినిమా తెలుగులోకి కూడా డబ్ అయిన సంగతి తెలిసిందే.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.