CSIR-UGC NET 2019 హాల్‌టికెట్లు విడుదల

దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం నిర్వహించనున్న ‘సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 2019’ పరీక్ష హాల్‌టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నవంబరు 9న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాది ప్రథమార్థానికిగాను జూన్ 16న నెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో విడతగా డిసెంబరు 15న పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also:

పరీక్ష విధానం ఎలా ఉంటుంది..?

★ మొత్తం 5 సబ్జెక్టులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్/ అట్మాస్ఫియరిక్/ ఓషియన్/ ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.

★ పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.

– ‘పార్ట్-ఎ’ విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

– ‘పార్ట్-బి’, ‘పార్ట్-సి’ విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.

Dont Miss:

రాత పరీక్ష ఎప్పుడు..?
డిసెంబరు 15న రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ.2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
★ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019

★ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.10.2019 (11:50 pm)

★ ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 16.10.2019 (11:50 pm)

★ దరఖాస్తు వివరాల సవరణకు చివరితేదీ: 18 – 25.10.2019

★ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 09.11.2019

★ పరీక్ష తేదీ: 15.12.2019

★ ఫలితాల వెల్లడి: 31.12.2019

Read More . .➦ ➦

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.