స్వదేశీ కావాలా? విదేశీ కావాలా?.. విటులకు బంపరాఫర్లు ఇస్తున్న వ్యభిచార నిర్వాహకులు

ఓ వైపు దేశమంతా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటుంటే వ్యభిచార నిర్వాహకులు దొరికిందే ఛాన్సంటూ తమ బిజినెస్ కానిచ్చేశారు. ముంబయిలో స్వదేశీ, విదేశీ అమ్మాయిలతో నిర్వహిస్తున్న సెక్స్ దందా పోలీసులు చేధించారు. వ్యభిచార కూపంలో చిక్కకున్న ఇద్దరు మహిళలను రక్షించారు. వ్యభిచార నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు.

Also Read:

వైలే పార్లే (వెస్ట్) ప్రాంతంలో నివసిస్తున్న ప్రభా ప్రబీర్ మండి అలియాస్ సోనీ(36) కొన్నాళ్లుగా చేస్తున్నారు. అంధేరి(ఈస్ట్)‌లోని మరోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని హోటల్ సహార్ గార్డెన్‌లో కొన్ని గదులు అద్దెకు తీసుకుని సెక్స్ రాకెట్ నిర్వహిస్తోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఓ పోలీసును విటుడి రూపంలో అక్కడికి పంపించారు. సోనీని కలుసుకున్న ఆ వ్యక్తి అమ్మాయిలు కావాలని అడగ్గా ఇద్దరు సెక్స్‌వర్కర్లను చూపించింంది. రష్యన్(30) మహిళకు రూ.25వేలు, లోకల్ అమ్మాయికి రూ.15వేలు ఛార్జ్ చేస్తామని చెప్పింది. దీంతో డబ్బులు చెల్లించి ఓ అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి ఆ విటుడు అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read:

దీంతో పోలీసులు వెంటనే ఆ ఇంటిపై రైడ్ చేసి ఇద్దరు సెక్స్‌వర్కర్లను రక్షించారు. వ్యభిచార నిర్వాహకురాలు సోనీని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆమెపై ఐపీసీలోని 370 (3) (మైనర్ అక్రమ రవాణా), 3 (సెక్స్‌రాకెట్ నిర్వహించడం), 4 (వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించడం), 5 ( విటులను ఆకర్షించడం) సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీవీ, సినిమాల్లో ఛాన్సుల పేరుతో సోనీ యువతులను నమ్మించి వ్యభిచార కూపంలోకి దించుతోందని పోలీసులు చెబుతున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.