సామజవరగమన ఖాతాలో మరో రికార్డ్‌.. ఆ డ్యాన్సర్స్‌తో తొలి సౌత్ సినిమా!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా . లాంగ్ గ్యాప్‌ తరువాత బన్నీ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్‌ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ టీజర్‌తో పాటు రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమనా పాట అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో సూపర్‌ హిట్ అయ్యింది. అందుకే పాట చిత్రీకరణ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధా తీసుకున్నారు చిత్రయూనిట్‌. ఆడియో సూపర్‌ హిట్ కావటంతో వీడియో సాంగ్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read:

ఆ అంచనాలను అందుకునే స్థాయిలో డిఫరెంట్ లోకేషన్స్‌లో గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం యూనిట్ పారిస్‌ వెళ్లారు. ప్రస్తుతం పారిస్‌లోని సుందరమైన లోకేషన్స్‌లో పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ పాటకు మరో అరుదైన ఘనత దక్కినట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. ఇప్పటికే ఈఫిల్‌ టవర్‌ ప్రాంతంలో పాట చిత్రీకరణ జరిగింది.

Also Read:

తాజాగా మరో ఐకానిక్‌ లోకేషన్‌లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్స్‌ ట్రూప్‌ లీడో టీంతో కలిసి బన్నీ, పూజాలు ఆడిపాడనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా అల వైకుంఠపురములో రికార్డ్‌ సృష్టించనుంది. లీడో ట్రూప్‌కు కూడా సామజవరగమన పాట బాగా నచ్చిందని చిత్రయూనిట్ తెలిపారు.

ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌, సీనియర్‌ నటి టబు, మలయాళ నటుడు జయరామ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.