సంక్రాంతికి ఇంటికొచ్చిన కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి

రక్తం పంచుకుని పుట్టిన కన్నకూతురిని కంటికి రెప్పగా కాపాడాల్సిన తండ్రే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. రాయవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిని వ్యక్తికి భార్య చనిపోయింది. 14ఏళ్ల కూతురు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. సంక్రాంతి సెలవుల నిమిత్తం శనివారం ఇంటికొచ్చింది. ఆదివారం నాయనమ్మతో ముచ్చట్లు చెబుతున్న కూతురిని ఆ కామాంధుడు గదిలోకి పిలిచాడు. వావివరుసలు మరిచి కూతురిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.

Also Read:

దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు సోమవారం రాత్రి ఆమెను గదిలోకి తీసుకెళ్లి మరోసారి అత్యాచారానికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక పక్కింట్లోకి పారిపోయింది. అయినా వదలని ఆ కామాంధుడు వారితో వాగ్వాదానికి దిగి కూతురిని లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు డయల్ 100కి ఫోన్ చేసి విషయం చెప్పారు. కాసేపటికే రాయవరం ఎస్సై ఎల్‌.శ్రీనివాస్‌ నాయక్‌ అక్కడకు చేరుకుని విచారణ చేపట్టి రామచంద్రపురం డీఎస్పీ ఎం.రాజగోపాలరెడ్డి, అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావుకు సమాచారం అందించారు.

Also Read:

సోమవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం బాలికను విచారించిన పోలీసులు నిందితుడిపై తండ్రిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికను కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును రామచంద్రపురం డీఎస్పీ ఎం.రాజగోపాలరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.