వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడా?

0
12

మా దూరపు బంధువుల్లో సమాజంలో మంచి గుర్తింపు కలిగిన ఒకాయన ఉన్నాడు. ఆయన కుమారుడు ఎవరికీ చెప్పకుండా ఒక ముస్లిమ్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా ముస్లిం ను అవుతానా? వైవి సుబ్బారెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి రక్తసంబధీకుడు కాదు. ఆయనకు తోడల్లుడు. వైఎస్ జగన్ కు వివేకానందరెడ్డిలా సొంత బాబాయి కాదు. బాబాయి వరుస అవుతాడు. వైఎస్సార్ కుటుంబం క్రైస్తవాన్ని పాటిస్తుంది. అంతమాత్రాన ఆయన తోడల్లుడు కూడా క్రైస్తవాన్ని పాటించాలని రూల్ ఉన్నదా?

వైవి సుబ్బారెడ్డి గారి గూర్చి నేను ముప్ఫయి ఏళ్లుగా వింటున్నాను. ఆ కుటుంబం స్వచ్ఛమైన హిందువులు. వారింట్లో ఏది జరిగినా, శుభాశుభ కార్యక్రమాలు హిందూధర్మ సంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. వారింట్లో నిత్య దైవారాధనలు జరుగుతాయి. దేవాలయసందర్శనలు, యజ్ఞాలు, హోమాలు, శాంతులు, జపాలు వారింట్లో నిత్యకృత్యం. క్రైస్తవులు ఎవరైనా గోపూజలు నిర్వహిస్తారా? క్రైస్తవులు అయ్యప్పమాలలు ధరిస్తారా? క్రైస్తవులు రుద్రాక్షలు అలంకరించుకుంటారా?  క్రైస్తవులు ఇంట్లో యాగాలు, యజ్ఞాలు చేస్తారా?  క్రైస్తవులు ఎపుడైనా బ్రాహ్మణ పురోహితులను పిలిచి కార్యక్రమాలు చేయించుకుంటారా.

సుబ్బారెడ్డి గారు ఏనాడైనా చర్చికి వెళ్లడం ఎవరైనా చూసారా? క్రైస్తవ గీతాలు పాడటం, ఏసు భజనలు చెయ్యడం చూసారా? సుబ్బారెడ్డిగారు హిందూ దేవాలయాలకు మాత్రమే వెళ్తారు. హిందూ సంప్రదాయాల ప్రకారం బొట్లు పెట్టుకుంటారు. మెడలో హిందూ దేవుళ్ళ లాకెట్స్ ధరిస్తారు. ఆయన ఎన్నడూ సిలువ గుర్తును కంఠాన వేసుకోవడం ఎవరూ చూడలేదు. హిందూ అనేది ఒక మతం కాదు. అది కేవలం ఒక ధర్మం. ఆ ధర్మాన్ని పాటించేవారు ఎవరైనా హిందువే అవుతాడు. ఆడంబరాలు, బాహ్యవేషాలు, ఆర్భాటాలే మతం అనుకుంటే అది భగవంతునికి సమ్మతం కాదు.

తట్టెడు మందంతో నుదుట తిరునామాలు ధరించేవాడు గొప్ప భక్తుడు అనుకోవడం ఎంత ఆజ్ఞానమో, దేవుడు ఎవరు అని ప్రశ్నించేవాడు పాషండుడు అనుకోవడం కూడా అంతే అజ్ఞానం. హిందువునని హెచ్చులు చెప్పుకునేవారు భగవంతునికి ఎంత సేవలు చేసారో మనం చూడటం లేదా? ఆలయానికి వచ్చిన యువతిని మానభంగం చేసే అర్చకులను, ప్రార్ధన కోసం చర్చికి వచ్చిన మహిళలను చెరిపివేసే ఫాదర్స్ ను మనం ఎన్నిసార్లు చూడలేదు? వారంతా పరమ భక్తులా నందుడు, కబీరు, కన్నప్ప హిందువులు కారు. కానీ, వారి భక్తికి మెచ్చి భగవంతుడు తనలో ఐక్యం చేసుకున్నాడు.

రామాయణాన్ని రచించిన వాల్మీకి, మహాభారతాన్ని రచించిన వ్యాసుడు ఏ కులస్తులు? ఆ రెండు గ్రంధాలను మనం ఎందుకు శిరస్సున ధరించి పూజలు చేస్తున్నాము? అరుంధతి ఎవరు? వసిష్ఠుడు ఎవరు? వారు మన వేదవిధుల్లో ఎందుకు పూజలు అందుకుంటున్నారు? కలియుగదైవం వేంకటేశ్వరుని లిప్తకాలం చూస్తేనే జన్మ ధన్యం అని నమ్ముతాము. మనకు శ్రీనివాసుని కరుణ అంతవరకే అని సంతృప్తి చెందుతాము. తనను ప్రతిరోజూ సేవించుకోమని ఆ వైకుంఠుడు సుబ్బారెడ్డికి ఆనతి ఇచ్చారు. అది ఆయన పూర్వజన్మల సుకృతం. ఆయన అదృష్టాన్ని స్వాగతించండి. మాయామోహంలో కొట్టుకుంటూ, అజ్ఞానుల్లా ఆయన వ్యక్తిత్వాన్ని హత్య చెయ్యడానికి ప్రయత్నించి దైవాగ్రహానికి లోను కాకండి.

దైవానుగ్రహపాత్రుడైన శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి శుభాకాంక్షలు

The post వైవి సుబ్బారెడ్డి క్రైస్తవుడా? appeared first on Tollywood Superstar.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here