వెక్కి వెక్కి ఏడుస్తున్న పప్పు.. చుక్కలు చూపిస్తున్న వర్మ

సంచలన దర్శకుడు తెరకెక్కిన మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వర్మ సెటైరికల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. ఇప్పటికే పోస్టర్‌లు, టీజర్‌, సాంగ్స్‌లో కావాల్సినంత కాంట్రవర్సీ క్రియేట్‌ చేసిన ఆర్జీవీ తాజాగా మరో బాండ్ పేల్చాడు.

సినిమాలోని పప్పులాంటి అబ్బాయి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశాడు వర్మ. ఆ పాట చూస్తే ఆ పాట ఎవరి ఉద్దేశించి రూపొందించాడో ఇట్టే అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పక్షనాయకుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ బాబును పోలిన పాత్రల నేపథ్యంలో ఈ పాటను రూపొందించాడు వర్మ. లోకేష్‌ను ప్రత్యర్థి పార్టీలు పప్పు అని పిలుస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పడే అదే పేరుతో వర్మ పాట రిలీజ్ చేయటం హాట్‌ టాపిక్‌గా మారింది.

Also Read:

అంతేకాదు పాటు తన వారసత్వాన్ని పప్పు లాంటి కొడుకు ఇవ్వాలని తపన పడే తండ్రి, తన కొడుకు అప్రయోజకత్వానికి చూసి మథన పడటం లాంటి సీన్స్‌తో రూపొందించాడు. దీంతో లోకేష్, చంద్రబాబు రాజకీయ వారసత్వన్ని అందుకోలేకపోతున్నాడంటూ వర్మ సెటైర్‌ వేస్తున్నాడని భావిస్తున్నారు. వర్మ రూపొందిస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో చంద్రబాబు, లోకేష్‌లతో పాట ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, పవన్‌ కళ్యాణ్‌, కేఏ పాల్, వంగవీటి రాధలను పోలిన పాత్రలు కూడా ఉన్నాయి. అయితే వర్మ మాత్రం తాను ఎవరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పాత్రలు సృష్టించలేదని, ఎవరికైన అలా అనిపిస్తే అది యాదృశ్చికమే అంటున్నాడు.

Also Read:

ఎన్నికల ముందు లక్ష్మీష్ ఎన్టీఆర్‌ సినిమాతో కూడా ఇదే స్థాయిలో హల్‌చల్‌ చేశాడు వర్మ. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ పార్వతి బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అయితే అప్పట్లో ఆ సినిమా రిలీజ్‌ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించింది. దీంతో వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా సమయంలోనే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను ప్రకటించాడు. చెప్పినట్టుగా ఇప్పుడు సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేశాడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్‌, అజయ్‌ మైసూర్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్‌ గోపాల్ వర్మ, సిద్ధార్థ్ తాతోలులు దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.