వీడియో: రోడ్డు మధ్యలో గుంతలో పడిన బస్సు.. అంత చూస్తుండగానే ప్రయాణికులు దుర్మరణం

రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు.. ఒక్కసారిగా భారీ గుంతలో పడిపోయింది. అంతా చూస్తుండగానే అందులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన చైనాలోని జినింగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 22 మందితో వెళ్తున్న బస్సు రోడ్డుమీద ట్రాఫిక్ మధ్యలో ఆగింది. ఇంతలో ఒక్కసారిగా అక్కడ పెద్ద శబ్దం ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఏర్పడిన భారీ గుంతలోకి బస్సు జారుకుంది.

ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని, మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పత్రికలు వెల్లడించాయి. బస్సు గుంతలో పడగానే మంటలు ఏర్పడి, పొగలు వచ్చాయి. విద్యుత్ స్తంభం బస్సు మీద పడటం వల్లే ఈ మంటలు ఏర్పడి ఉండవచ్చని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే వెయ్యి మంది రెస్క్యూ వర్కర్లు, 30 వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. వెంటనే క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్‌కు తరలించారు.

వీడియో:

Also Read:

జనవరి 13న సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడిన గుంత సుమారు 32 అడుగుల లోతు ఉందని తెలిపారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న రిటైర్డ్ పోలీస్ అధికారి సన్ వాంగ్హాంగ్ మాట్లాడుతూ.. ‘‘బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఓ మహిళ సాయం కోసం అరవడం విన్నాను. దగ్గరకు వెళ్లి చూడగా ఆమె రోడ్డు గుంతపై ఉన్న కొనకు వేలాడుతూ కనిపించింది. నేను ఆమెకు చేతినిచ్చి సాయం చేసేందుకు ముందుకెళ్లాను. అంతలో ఆ రోడ్డు మరోసారి కుంగిపోయింది. ఆ మహిళ కూడా గుంతలో పడిపోయింది’’ అని తెలిపారు.

Watch Video:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.