వీడియో: రణరంగంగా ట్యాంక్ బండ్‌.. తీవ్ర ఉద్రిక్తత

ట్యాంక్ బండ్‌పై హై టెన్షన్ చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ ఆందోళన రణరంగంగా మారింది. బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెను దాటుకొని ట్యాంక్ బండ్‌పైకి దూసుకొచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు చేయడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఆర్టీసీ కార్మికులు, విపక్ష నేతలు, విద్యార్థి సంఘాల నేతలు పదుల సంఖ్యలో గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్యాంక్ బండ్‌పై చోటు చేసుకున్న ఘర్షణ, ఉద్రిక్త పరిణామాలను వీడియోలో చూడవచ్చు..

Also Read:

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శనివారం (నవంబర్ 9) ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ పైకి చేరుకొని సకల జనుల దీక్ష చేపట్టాలని భావించారు. దీనికి విపక్షాలు మద్దతు ప్రకటించాయి. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. కానీ, జేఏసీ నేతల పిలుపు అందుకొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్‌కు భారీగా చేరుకున్నారు.

నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరించారు. బారీకేడ్లు, ముళ్ల కంచెలతో ట్యాంక్ బండ్‌కు దారి తీసే అన్ని రహదారులను మూసేశారు. జేఏసీ నేతలతో పాటు 400 మంది కార్మికులను అరెస్టు చేశారు. అయినప్పటికీ కొంత మంది కార్మికులు ఇనుప సంకెళ్లను చేధించుకొని ట్యాంక్ బండ్ పైకి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.