విహారయాత్రకు వెళ్తూ.. లారీ చక్రాల కింద నలిగిన మెడికల్ స్టూడెంట్

విశాఖ నగరంలో విషాదం నెలకొంది. మల్కాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మారుతి సర్కిల్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెడికల్ స్టూడెంట్ శ్రీవిద్య ప్రాణాలు కోల్పోయింది. శ్రీవిద్య గురువారం ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన ఫెస్ట్‌లో స్నేహితులతో కలిసి సందడి చేసిన శ్రీవిద్య రోజు గడవకముందే ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read:

విశాఖ 46వ వార్డు శ్రీహరిపురం, శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మొగిలిపురి రవికుమార్‌ చౌదరి ఆంధ్రాబ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె శ్రీవిద్య ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో ఏడాది చదువుతోంది. స్నేహితులతో కలిసి లంబసింగి వెళ్లేందుకు శ్రీవిద్య శుక్రవారం రాత్రి ఫ్రెండ్ సంతోష్‌తో కలిసి గాజువాకకు బయలుదేరింది.

Also Read:

వీరి బైక్‌ మారుతి సర్కిల్ వద్దకు వచ్చేసరికి అదుపుతప్పడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ శ్రీవిద్య తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడిక్కడే చనిపోయింది. సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్నేహితులంతా కలిసి ఏర్పాటుచేసుకున్న విహారయాత్ర కాస్తా ఈ ఘటనతో విషాదంగా మారిపోయింది. శ్రీవిద్య మృతదేహం వద్ద ఆమె తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంతోష్ బైక్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.