వాళ్లకి జీతాలిచ్చిన తరువాతే నాకు ఇవ్వండి.. హృదయాలను కదిలిస్తున్న ఐఏఎస్ లేఖ

ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వేలు, లక్షల్లో ఉన్న జీతాలు ఠంచనుగా నెలలో మొదటి రోజునే ఖాతాల్లో పడిపోతాయి. మరి మూడు, నాలుగు తరగతి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? దురదృష్టవశాత్తూ క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నావారే. వారి జీతాలు ఎంత ఉంటాయో కూడా వేరే చెప్పనవసరం లేదు. వేలు, లక్షల్లో జీతాలు ఉండే అధికారులకు నెలలో తొలిరోజునే జీతాలు పడిపోతుంటే.. కిందిస్థాయి ఉద్యోగులకు మాత్రం రెండు, మూడు నెలలకు జీతాలు చెల్లిస్తున్న దుస్థితి.

ఈ పరిస్థితిని సునిశితంగా గమనించిన ఏపీకి చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు తీసుకున్న తర్వాతే తాను జీతం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇకపై క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తరువాతే తనకు జీతం చెల్లించాలని కోరారు. అందుకు సమ్మతిస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ కూడా సమర్పించారు. ఆయనెవరో కాదు సీనియర్ ఐఏఎస్ . సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హృదయాలను కదిలించేలా ఉన్నాయి.

Also Read:

తన లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నారు. కానీ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చడంలో కీలకంగా వ్యవహరించే మూడు, నాలుగు తరగతుల ఉద్యోగులకు మాత్రం సమయానికి జీతాలు అందట్లేదు. నెలలో రెండు, మూడు వారాల తరువాత జీతాలు చెల్లిస్తున్నారు. వారిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.

ఎవరికైనా అవసరాలు ఒకటే. కానీ తన లాంటి అధికారులకు జీతాలు ఒకటో తేదీన రాకపోతే అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. కానీ వారు అలా కాదు. అందుకే వారికి జీతాలు చెల్లించిన తరువాతే తనకు జీతం చెల్లించాలని కోరారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. లేఖతో పాటు తన సెల్ఫ్ డిక్లరేషన్ కూడా జత చేశారు. ఇప్పుడది ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. కిందిస్థాయి ఉద్యోగుల కష్టాలను గుర్తించిన ఐఏఎస్ అంటూ సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.