వరదలతో మంచే జరిగింది.. ఇసుక ఎంతొచ్చిందంటే.! లెక్కలు చెప్పిన మంత్రి

ఏపీలో ఇసుక కొరతపై పెద్ద దుమారం రేగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అసమర్థత వల్లే ఇసుక కొరత ఏర్పడిందని విపక్షాలు ఆరోపిస్తుండగా వరదల వల్లే ఇసుక లభ్యత తగ్గిందని అధికార పార్టీ ఎదురుదాడి చేస్తోంది. తాజాగా ఈ విషయమై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. కొద్దిరోజుల్లో ఇసుక కొరతే ఉందని ఆయన భరోసానిచ్చారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం వర్షాలే కురవలేదని.. జగన్ వచ్చాక వరదలు వస్తున్నాయన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార అన్ని నదుల్లోనూ వరద పొంగుతోందన్నారు. వర్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని వ్యాఖ్యానించారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఉందన్న పెద్దిరెడ్డి.. ఇకముందు ఇసుక ఇబ్బందులు ఉండే అవకాశం లేదన్నారు. గతంలో ఉన్న ఇసుక నిల్వల కంటే ప్రస్తుతం గణనీయంగా పెరిగాయని ఆయన వివరించారు.

Also Read:

చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో కేవలం కోటి 30 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం అది 10 కోట్ల క్యూబిక్ మీటర్లకు చేరిందన్నారు. వరదలు రావడం వల్లే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. మున్ముందు ఇసుక ఇబ్బందులు పడే అవకాశం లేదని పెద్దిరెడ్డి తెలిపారు. భవిన నిర్మాణ కార్మికులకు వర్షాకాలంలో పని ఉండదని.. కానీ దానిని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం మానవత్వంతో ఆత్మహత్యలు చేసుకున్న వారందరికీ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తోందని చెప్పారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. రౌడీలు, దుర్మార్గులు అంటూ చంద్రాబాబు అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఆయన సొంత జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు వేలల్లో మెజార్టీ వచ్చిందని.. అది ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్థాయికి తగ్గట్లు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. జిల్లా ప్రజలు ఎవరిని ఆదరిస్తున్నారో ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. లాంగ్ మార్చ్‌పై సెటైర్లు వేశారు. లాంగ్‌ మార్చ్ మూడుకిలోమీటర్లట. దానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్ చంద్రబాబేనని విమర్శించారు.

Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.