వదినతో అక్రమ సంబంధం.. భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య

వావి వరుసలు మరిచి వదినతో పెట్టుకున్న భర్తను మందలించడమో ఆ ఇల్లాలు చేసిన నేరమైంది. పద్ధతి మార్చుకుని బుద్ధిగా తనతో ఉండాలని చెప్పిన భార్యను చిత్రహింసలు పెట్టాడు. ఆ కిరాతకుడు పెట్టే బాధల కంటే చావే నయమనుకుని ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలో జరిగిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

Also Read:

ఖానాపూర్ మండలం బీర్నండి పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి బుక్య చెందిన బలిరాంకు భార్య లక్ష్మి(40), కుమారుడు వెంకటేశ్, కూతుళ్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. బలిరాం అన్న కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో అతడి భార్య గ్రామంలోనే పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే ఒంటరిగా ఉంటున్న వదినపై బలిరాం కన్నేశాడు. ఆమెకు అవసరానికి డబ్బులిస్తూ, కావాల్సిన పనులు చేసి పెడుతూ చనువు పెంచుకున్నాడు. మరిది ఆలోచనను అర్థం చేసుకున్న ఆమె అతడికి లొంగిపోయింది. దీంతో వదినా మరిదులిద్దరూ తరుచూ రాసలీలల్లో ముగిని తేలేవారు.

Also Read:

ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి అనేకసార్లు భర్తను హెచ్చరించినా అతడు పట్టించుకోలేదు. దీనిపై పెద్దల మధ్య ఎన్నోసార్లు పంచాయతీలు జరిగినా బలిరాం పద్ధతి మారలేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి.శుక్రవారం పంటచేను కోసేందుకు వెళ్లిన లక్ష్మిని బలిరాం తీవ్రంగా కొట్టాడు. తనను వదిలేయాలని వేడుకున్నా కనికరించకుండా భార్యను చిత్రహింసలు పెట్టాడు. దీంతో లక్ష్మి అక్కడే ఉన్న పురుగులమందు తాగేసింది. వెంటనే వైద్యం అందకపోవడంతో పొలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.