లేడీ కోహ్లీని ఇంట్లో తయారు చేస్తున్న వార్నర్

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్‌‌కి భారత్‌లో లెక్కకి మించి అభిమానులున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ని ఇండియాలో భారత క్రికెటర్ల తరహాలో ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆదరిస్తుంటారు. అందుకే వార్నర్‌ కూడా ఐపీఎల్‌ అనే కాదు.. ఆస్ట్రేలియా తరఫున సిరీస్‌ కోసం ఇక్కడికి వచ్చినా ఫ్యామిలీని తీసుకొస్తుంటాడు. తాజాగా తన భార్య కాండిస్‌, కూతుళ్లు ఇవీ మై, ఇండీ రేతో కలిసి వార్నర్ ఇంట్లోనే సరదాగా క్రికెట్ ఆడాడు.

ఇండీకి కాసేపు బౌలింగ్ చేసిన వార్నర్.. చిన్నారి కొట్టిన షాట్స్ చూసి.. ఆమె విరాట్ కోహ్లీ కావాలనుకుంటోంది అని వీడియోలు పోస్ట్ చేస్తూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధానికి గురైన .. ఈ ఏడాది ఐపీఎల్ టైమ్‌లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్.. ఆస్ట్రేలియా సిరీస్‌ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.

వాస్తవానికి డేవిడ్ వార్నర్‌ది దూకుడు స్వభావం. కెరీర్ ఆరంభంలో మద్యం సేవించి క్లబ్‌లో గొడవపడిన వార్నర్ కొన్ని రోజులు నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కూడా ప్రాక్టీస్ సెషన్‌లకి డుమ్మా కొట్టడం ద్వారా అతనిపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. కానీ.. తండ్రిగా మారిన తర్వాత వార్నర్‌లో ఊహించని మార్పు వచ్చింది. ఇప్పుడు మైదానంలోనే కాదు వెలుపల కూడా ఎలాంటి గొడవలకి వెళ్లడం లేదు. సహచర క్రికెటర్లతో నవ్వుతూ పలకరిస్తుంటాడు. కానీ.. గత ఏడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమయంలో మాత్రం డికాక్.. తన భార్య గురించి కామెంట్ చేయడంతో వార్నర్ సహనం కోల్పోయి గొడవకి దిగాడు. ఇదే బాల్ టాంపరింగ్‌‌కి అతడ్ని ఉసిగొల్పింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.