రేపిస్టును చంపి, శవాన్ని కారుకు కట్టి ఈడ్చుకెళ్లిన మహిళ

మహిళపై అత్యాచారం చేసిన రేపిస్టు.. ఆమె కుమార్తెను కూడా లోబరుచుకోడానికి ప్రయత్నించాడు. ఫలితంగా అతడు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. బతికి ఉండగానే నరకాన్ని చూశాడు. తీవ్రమైన గాయాలతో దారుణమైన చావును కొనితెచ్చుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటుచేసుకుంది.

Also Read:

రాక్సాన్నే ఎకా పీటర్స్ (35) అనే వ్యక్తి 51 ఏళ్ల గ్రాంట్ కాస్సర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనతో మరింత సేపు సెక్స్‌ చేసేందుకు సహకరించకపోతే ఆమె కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడతానని తెలిపాడు. దీంతో ఆమె అతడికి సహకరించింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కాస్సర్‌ను కలిసిన పీటర్స్.. తనతో సెక్స్ చేయకపోతే ఆమె కుమార్తెను లోబరుచుకుంటానని చెప్పాడు. దీంతో కాస్సర్ తన కుమార్తెను ఎలాగైనా అతడి నుంచి రక్షించుకోవాలని భావించింది.

Also Read:

అతడిని మాటల్లో పెట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత వంట గదిలోకి వెళ్లి కత్తి తెచ్చింది. అతడు అప్రమత్తంగా లేని సమయంలో కత్తితో గుండెల్లో పొడిచింది. ఆ తర్వాత ఓ తాడును అతడి మెడకు బిగించి రోడ్డు మీదకు లాక్కెళ్లింది. తన ఇంటికి సమీపంలోని క్యాపాబలా పోలీస్ స్టేషన్ మీదుగా సుమారు రెండు కిలోమీటర్లు అతడిని ఈడ్చుకెళ్లింది. అయితే, అప్పటికే పీటర్స్ చనిపోయాడు. దీంతో ఆమె అతడి శవాన్ని రోడ్డుపక్కన ఉన్న చిన్న పిల్ల కాలువలో పడేసి ఇంటికి వెళ్లిపోయింది.

Also Read:

ఆ తర్వాతి రోజు ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ జంటకు పీటర్స్ శవం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ కెమేరాల్లో రికార్డైన వీడియోలను చూసి కాస్సర్‌ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. పీటర్స్ శరీరంపై కత్తిపోట్లతోపాటు 64 గాయాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు అందించిన నివేదికలో తెలిపారు. కోర్టు ఈ హత్యను తీవ్రంగా పరిగణించింది. ‘‘రేపిస్టు నుంచి ఆత్మరక్షణ కోసం పోరాడటంలో తప్పులేదు. కానీ, కత్తితో పొడిచిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, అతడిని కారుకు కట్టి ఈడ్చుకెళ్లి హత్యచేయడం అమానవీయం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆమెకు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.