రూ. 16 లక్షలు సమర్పించుకున్న పల్లెటూరి దంపతులు.. రూటుమార్చిన సైబర్ నేరగాళ్లు

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎత్తులకు పైఎత్తులు ఎన్ని వేస్తున్నా నేరగాళ్లు మాత్రం ఆగట్లేదు. రకరకాల రూట్లు మార్చి అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో సైబర్ పోలీసులు నిఘా పెంచడంతో పల్లెలను టార్గెట్‌గా చేసుకున్నారు. గ్రామీణ ప్రజల ఆశలను ఆసరగా చేసుకుని నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే జిల్లాలో చోటు చేసుకుంది.

Also Read:

లాటరీల పేరుతో అమాయక దంపతులను దారుణంగా మోసం చేశారు. సైబర్ నేరగాళ్లకు లక్షల రూపాయిల సమర్పించుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు మండలం చేవూరుకు చెందిన అశోక్‌కు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. దంపతుల పేరు మీద రూ. 46 లక్షల లాటరీ వచ్చిందని నమ్మబలికాడు. రూ. 16 లక్షలు తమ అకౌంట్‌లో జమచేస్తే ఆ మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. దీన్ని గుడ్డిగా నమ్మేశారు ఆ దంపతులు.

Also Read:

లాటరీ డబ్బు వస్తే తమ బతుకులు బాగుపడుతాయని భావించిన అశోక్‌, ముత్తమ్మ దంపతులు.. ఇల్లు, తాళి సహా సర్వం అమ్మేసి రూ.16 లక్షలు సైబర్‌ నేరస్తుల అకౌంట్‌లో జమ చేశారు. తర్వాత ఎంతకీ అటువైపు నుంచి కాల్ రాకపోవడంతో దంపతులే ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. వెంటనేఅశోక్‌ దంపతులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని, ప్రభుత్వమే స్పందించి తమ డబ్బులు రికవరీ చేయించాలని బాధితులు వేడుకుంటున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.