రానా పౌరాణిక చిత్రం ఆగిపోలేదు.. అప్డేట్‌ ఇచ్చిన దర్శకుడు

యంగ్ హీరో రానా సినిమాల నుంచి లాంగ్‌ బ్రేక్‌ తీసుకోవటంతో గతంలో ప్రకటించిన చాలా సినిమాలు ఆగిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానా ప్రధాన పాత్రలో దర్శకత్వంలో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేసిన భారీ పౌరాణిక చిత్రం హిరణ్య కశ్యప కూడా ఆగిపోయినట్టుగా వార్తలు వినిపించాయి.

రానా ఆరోగ్య పరిస్థితి సరిగాలేదన్న వార్తలు రావటంతో ఇంత భారీచిత్రాన్ని రానా సహకరిస్తాడా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అదే సమయంలో రానా భారీగా బరువు తగ్గటం కూడా హిరణ్యకశ్యప సినిమా మీద అనుమానాలకు కారణమైంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌ పై అప్‌డేట్‌ వచ్చింది.

Also Read:

దర్శకుడు గుణశేఖర్‌ ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం వెల్లడించకపోయినా, ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టుగా వెల్లడించాడు. ఇటీవల గుణశేఖర్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో `సహాయ దర్శకులు: తెలుగు భాష పై పట్టు, తెలుగు సాహిత్యం పై అవగాహన కలిగిఉన్న వారు మీ వివరములతో వెంటనే సంప్రదించండి` అంటూ పోస్ట్ చేశారు.

Also Read:

దీంతో హిరణ్యకశ్యప సినిమా కోసం ఈ ప్రకటన చేశారన్న టాక్ వినిపిస్తోంది. 2015లో రిలీజ్‌ అయిన రుద్రమదేవి సినిమా తరువాత గుణశేఖర్‌ పూర్తిగా ఈ సినిమా పనిలోనే ఉన్నాడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రానా టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా కాలంగా జరుగుతోంది.

ఇక రానా విషయానికి వస్తే ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రానా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. వచ్చే నెలలో తిరిగి షూటింగ్‌లకు హాజరయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న హాథీ మేరే సాథీ షూటింగ్‌ను ముందుగా పూర్తి చేయనున్నాడు. తరువాత వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమా ప్రారంభించనున్నాడు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.