రవిచంద్రన్ అశ్విన్ సెలబ్రేషన్స్ షోషల్ మీడియాలో వైరల్ (వీడియో)

భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆదివారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ సందర్భంగా తన హావభావాలతో అలరించాడు. జట్టులోకి వచ్చి దాదాపు దశాబ్దకాలం అయినా ఎల్లప్పుడూ ప్రశాంతంగా కన్పించే అశ్విన్.. సూరత్‌లో తమిళనాడు, కర్ణాటకల మధ్య జరిగిన మ్యాచ్‌లో తన ఎమోషన్లతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కర్ణాటక.. ఒక్కపరుగు తేడాతో తమిళనాడుపై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో అశ్విన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
Read Also:

తొలుత బౌలింగ్ వికెట్లు తీసినప్పుడు అశ్విన్ విభిన్నంగా స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌ వికెట్లు తీసినప్పుడు అశ్విన్ హవాభావాలు హైలైట్. సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ లాగా రెండు చేతులూ చాపుతూ మైదానం కలియతిరిగాడు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also:

ఇక బ్యాటింగ్‌లోనూ తనదైన శైలిలో అలరించాడు. ఛేజింగ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని తలపించేలా తను ఆడిన ఫుల్‌షాట్ అద్భుతమనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ బంతిని పొరపాటుపడి ఫీల్డర్ ఆపలేకపోయాడు. దీంతో బంతి బౌండరీ వెళ్లి నాలుగు పరుగులు లభించాయి. ఈక్రమలో అశ్విన్.. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికుర్ రహమ్‌ను తలపించేలా ప్రి మెచ్యూర్ సెలబ్రేషన్లతో ఆశ్చర్యపరిచాడు. అయితే అశ్విన్ పోరాడినప్పటికీ టార్గెట్ ఛేజ్ చేయలేక తమిళనాడు ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది.
Read Also:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.