యంగ్ హీరోతో గుత్తా జ్వాల డేటింగ్‌.. ముద్దులతో న్యూ ఇయర్‌కి వెల్‌కం

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఓ యంగ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్టుగా కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తమిళ యువ నటుడు విష్ణు విశాల్‌లో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తూ వస్తోంది జ్వాల. అయితే అతనితో ఉన్న రిలేషన్‌ విషయంలో మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.

అయితే రిలేషన్‌లో ఉన్నట్టుగా అధికారికంగా ప్రకటించకపోయినా న్యూ ఇయర్‌ సందర్భంగా జ్వాల ట్వీట్ చేసిన ఫోటోలతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై క్లారిటీ వచ్చేసినట్టే అనిభావిస్తున్నారు నెటిజెన్లు. న్యూ ఇయర్‌ను విష్ణు విశాల్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న జ్వాల ఆ ఫోటోలను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది.

Also Read:

అయితే గతంలో ట్వీట్ చేసిన ఫోటోల్లో కాస్త దూరంగా కనిపించిన జ్వాలా, విష్ణు తాజాగా ఫోటోల్లో మాత్రం సన్నిహితంగా కనిపించారు. ముఖ్యంగా విష్ణు, జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటోతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్టే అని ఫిక్స్‌ అయిపోయారు నెటిజెన్లు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను వరుసగా ట్వీట్ చేసిన జ్వాల… `హ్యాపీ 2020, మై బేబీ హ్యాపీ న్యూ ఇయర్‌, మా నుండి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు` అంటూ ట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. వీరిద్దరు తమ పార్టనర్స్‌తో విడిపోయిన వారు కావటం విశేషం.

Also Read:

మరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు చేతన్‌ ఆనంద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల తరువాత అభిప్రాయ భేదాలు రావటంతో విడిగా ఉంటున్నారు. హీరో కూడా గత జూన్‌లో భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. అయితే విష్ణు భార్య నుంచి విడిపోవడానికి గుత్తా జ్వాలే కారణం అన్న టాక్‌ కూడా వినిపిస్తోంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.