మూడో టీ20పై ట్వీట్‌తో చిక్కుల్లో పడిన గంగూలీ

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌పై ట్వీట్ చేసిన బీసీసీఐ అధ్యక్షుడు చిక్కుల్లో పడ్డాడు. నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టీ20 సిరీస్ విజేతగా నిలవనుంది. ఢిల్లీలో జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్, రాజ్‌కోట్‌లో ముగిసిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read More:

‘భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్‌ పోరు పతాకస్థాయికి చేరింది. సిరీస్ ఇప్పటికే 1-1తో సమమవడంతో విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ20పై ఉత్కంఠ నెలకొంది. రెండో టీ20లో గెలిచిన టీమిండియా మూడో టీ20లోనూ ఆ విజయపరంపరని కొనసాగిస్తుందా..? లేదా సిరీస్‌లో బంగ్లాదేశ్ మళ్లీ పుంజుకుంటుందా..? మై11 సర్కిర్‌లో మీరు జట్టుని ఎంపిక చేసుకుని నా జట్టుని ఓడించండి.. అలానే ప్రైజ్‌లు గెలవండి’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.

Read More:

బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఇలా ఓ క్రికెట్ ఫాంటసీ వెబ్‌సైట్‌ని ప్రమోట్ చేయడమేంటి..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గంగూలీ ట్వీట్ కారణంగా బీసీసీఐ ప్రస్తుత అఫిషియల్ పార్ట్‌నర్‌గా ఉన్న క్రికెట్ ఫాంటసీ వెబ్‌సైట్ డ్రీమ్ 11‌పై ఆ ప్రభావం పడుతుందని.. ఇది ఎంత వరకూ న్యాయం..? అని దాదాని సోషల్ మీడియాలో అడుగుతున్నారు.

బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ గతంలోనే రాహుల్ ద్రవిడ్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు సౌరవ్ గంగూలీకి కూడా విరుద్ధ ప్రయోజనాల అంశం కింద షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. బీసీసీఐ పదవుల్లో ఉంటూ.. క్రికెట్ సంబంధిత లేదా అనుబంధంగా ఉన్న వాటిల్లో ఎలాంటి పదవులు, బాధ్యతలు చేపట్టకూడదు. దీంతో.. గంగూలీ, ద్రవిడ్, సచిన్.. క్రికెట్ సలహా కమిటీకి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా గంగూలీ చర్యపై డీకే జైన్ ఏ విధంగా స్పందిస్తాడో..? చూడాలి. మై11 సర్కిల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటికీ గంగూలీ కొనసాగుతున్నట్లు తాజా ట్వీట్ ద్వారా స్పష్టమైంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.