మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీ కన్‌ఫర్మ్‌.. దర్శకుడెవరంటే?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్‌ ఎంట్రీపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కొంతమంది దర్శక నిర్మాతలు మహేష్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేసినా అప్పట్లో మహేష్‌ ఆ ప్రతిపాదనలు తిరస్కరించాడు. అయితే ఇటీవల సౌత్‌లో పాన్‌ ఇండియా సినిమాల హవా కనిపిస్తుండటంతో మహేష్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

త్వరలోనే టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ కూడా ఓ పాన్‌ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నాడట. గతంలో స్పైడర్‌ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించిన మహేష్‌ ఇప్పుడు దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది.

Also Read:

ఇటీవల కన్నడలో సూపర్‌ హిట్ అయిన భారీ చిత్రం కేజీఎఫ్ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్ దర్శకుడు. ఈ సినిమాతో ప్రశాంత్‌ నీల్‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్‌ వచ్చింది. దీంతో తెలుగు హీరోలు కూడా ప్రశాంత్‌తో చర్చలు జరిపారు. స్టార్‌ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నారు.

Also Read:

అయితే సూపర్‌ స్టార్‌ , చెప్పిన కథకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందించే ఆలోచనలో ఉన్నారు సూపర్‌ స్టార్‌ టీం. అంతేకాదు ఈ సినిమాతో మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహేష్‌ బాబు ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్, మిలటరీ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్‌ విజయ శాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.