మహిళలనే కనికరం కూడా లేకుండా.. పోలీసుల తీరుపై విమర్శలు

ర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల నిర్బంధాన్ని చేధించుకొని.. బారీకేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను దాటుకొని ఆందోళనకారులు, కొంత మంది మహిళలు ట్యాంక్ బండ్‌పైకి దూసుకొచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు చేయడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

మహిళా కార్మికులతోనూ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. లాఠీఛార్జ్‌లో పలువురు మహిళలు గాయపడ్డారు. మహిళా పోలీసులు లేకున్నా.. తమను నెట్టేస్తూ అరెస్ట్ చేశారని కొంత మంది మహిళలు ఆరోపించారు.

Watch:

ట్యాంక్ బండ్‌పై విధులు నిర్వహించిన సీఐ కిషోర్.. ఓ మహిళా కార్మికురాలిపై తీవ్రంగా దాడి చేశారని కార్మికులు ఆరోపించారు. సీఐ దాడిలో సదరు కార్మికురాలి కంటి నుంచి తీవ్ర రక్తస్రావమైందని.. అప్పటికీ ఆయన కనికరం చూపకుండా దారుణంగా వ్యవహరించారని చెప్పారు. తోటి కార్మికులు ఆమెకు రక్షణగా గుమికూడినా.. ఆ అధికారి కనీస మానవత్వం కూడా చూపకుండా వ్యవహరించారని ఆరోపించారు.

అక్కడి నుంచి వెళ్లకుంటే అందరికీ ఇదే గతి పడుతుదంటూ సీఐ కిషోర్ హెచ్చరించారని మహిళా కార్మికులు చెప్పారు. ట్యాంక్‌ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు.. మహిళలను టార్గెట్ చేసుకొని దాడులు చేసినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్మికులను ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో జేఏసీ నేతలు.. మహిళలను ముందుకునెట్టి వివాదాస్పదం చేయడానికి చూశారని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.