మహిళతో ఎస్పీ సరస సంభాషణ.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌ జిల్లా సీనియర్ ఎస్పీ వైభవ్‌ కృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో సెక్స్ ఛాటింగ్ చేస్తున్న వీడియోలు ఆన్‌లైన్లో లీక్ కావడం కలకలం రేపింది. వీడియోలో ఎస్పీ ఆ మహిళతో రొమాంటిక్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ మహిళ మొహం మాత్రం కనిపించడం లేదు. ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఎస్పీ వైభవ్‌ కుమార్ స్పందించారు.

Also Read:

తన ప్రతిష్టను దెబ్బతీయడానికే కొందరు కుట్రపూరితంగా మార్ఫింగ్‌ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. గత ఏడాది వ్యవస్థీకృత నేరాలపై, సెక్స్ రాకెట్లపై తాను కఠినమైన చర్యలు తీసుకున్నానని, దానికి ప్రతీకారం తీర్చుకోవడానికే తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో లీక్‌ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు పోలీసులు ఈ వీడియో లీకేజ్‌ అంశంపై దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పారదర్శకంగా జరిగేందుకు మీరట్ జిల్లాకు కేసు ట్రాన్స్‌ఫర్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.