మహారాష్ట్ర అమ్మాయిలతో గోవా బీచ్‌లో వ్యభిచారం.. పోలీసుల అదుపులో సెక్స్ వర్కర్లు

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న సెక్స్ రాకెట్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. రాజధాని పనాజీలోని కలాన్‌గుటీ బీచ్ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు ఇద్దరు వ్యక్తులు అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆండ్రియా పెరీరా అనే స్వచ్ఛందసంస్థతో కలిసి ఓ ప్లాన్ ప్రకారం వారిని పట్టుకున్నారు.

Also Read:

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను విటుడిగా మారువేషంలో కలాన్‌గుటీ బీచ్‌కు పంపించారు. అతడు సెక్స్ వర్కర్ల కోసం వెతుకుతున్నట్లు నాటకమాడగా ఇద్దరు వ్యక్తులు వచ్చి అతడి సంప్రదించారు. తమ వద్ద చాలామంది అమ్మాయిలు ఉన్నారని, సేఫ్ ప్లేస్‌లో పని కానిచ్చుకోవచ్చని చెప్పి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న అక్షయ్(27), థోఫిక్ (27)ను అరెస్ట్ చేసి అనేక మంది యువతులను రక్షించారు. సెక్స్ వర్కర్లందరినీ పనాజీలోని రాష్ట్ర మహిళల సదనానికి తరలించారు.

Also Read:

అక్షయ్, థోఫిక్ మహారాష్ట్ర నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గోవాలో వ్యభిచారం చేయిస్తున్నారని డీఎస్పీ మహేష్ గోవంకర్ తెలిపారు. వ్యభిచారం చేస్తే బాగా డబ్బులు సంపాదించొచ్చంటూ వారిని మభ్యపెట్టి సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారని వెల్లడించారు. సెక్స్ రాకెట్‌ బాగోతంపై సమగ్ర దర్యాప్తు జరిపి.. దీని వెనుక ఎవరెవరున్నారన్న దానిపై నిజానిజాలు వెలికి తీస్తామని తెలిపారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.