మతిస్థిమితం లేని మహిళను తల్లిని చేసిన కామాంధులు.. ఒకరి అరెస్ట్

జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్‌ గ్రామంలో మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేసిన కేసులో పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ నిందితుడిని సోమవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

Also Read:

హనకనహాళ్‌కు చెందిన ఓ మహిళను కొందరు వ్యక్తులు లొంగదీసుకుని బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేసిన ఘటన కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. గర్భం దాల్చిన బాధితురాలు గతవారం బాలికకు జన్మనివ్వడంతో పోలీసులు ఆరా తీశారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసులో కీలక నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశారు. అత్యాచార విషయం ఎవరికీ చెప్పొద్దని కొందరు పెద్దలు గ్రామంలో పంచాయతీ పెట్టి బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు.

Also Read:

కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందిన వారుగా ప్రచారం జరుగుతోందని, ఎవరైనా సరే నేరం చేసినట్లు తేలితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.