భార్య వెళ్లిపోయింది, ఒంటరి పురుషుడి పింఛన్ కావాలి.. అసిఫాబాద్ వ్యక్తి డిమాండ్

ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చినట్లే.. తనకూ పింఛన్ ఇవ్వాలని ఓ వ్యక్తి డిమాండ్ చేస్తున్నాడు. తన భార్య తొమ్మిదేళ్ల కిందటే తనను వదిలేసి పోయిందని.. కూలి పనులు చేసుకొని వృద్ధులైన తల్లిదండ్రులను పోషిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కావాలని కోరుతూ గ్రామ సర్పంచికి వినతిపత్రం సమర్పించాడు. ఈ ఆసక్తికర ఘటన కుమ్రంభీం అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

‘ఈటీవీ తెలంగాణ’ కథనం ప్రకారం.. అసిఫాబాద్‌ జిల్లా బూరుగూడకి చెందిన ధరణి తిరుపతి తన తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య తన నుంచి తొమ్మిదేళ్ల కిందటే విడిపోయిందని.. నాటి నుంచి తాను ఒంటరినైపోయానని చెబుతున్నాడు. కూలి పనులు చేసుకుంటూ వృద్ధులైన తల్లిదండ్రులను పోషించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Must Read:

తన పేరు మీద భూమి గానీ, ఇతర ఆస్తులు గానీ ఏవీ లేవని తిరుపతి గోడు వెల్లబోసుకున్నాడు. ఒంటరి మహిళలకు నెల నెలా రూ.2016 ఆసరా పింఛన్ అందించినట్లే.. ఒంటరి పురుషుడినైన తనకూ పింఛన్ అందించాలని కోరుతున్నాడు. తన వినతి పత్రంపై స్పందించి ప్రభుత్వం తగిన సాయం చేయాలని కోరాడు.

Also Read:

తెలంగాణ ప్రభుత్వం.. ఒంటరి మహిళలకు నెల నెలా పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో రూ.1016 పింఛన్ ఇవ్వగా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ సర్కార్ దీన్ని ఇటీవల రూ.2016కు పెంచింది. అయితే.. మహిళల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ పింఛన్‌ను తనకూ కావాలని ఓ పురుషుడు కోరడం చర్చనీయాంశంగా మారింది.

Photo Credit: ETV Telangana

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.