భారత్‌పై ఫైనల్ టీ20లో బంగ్లా ఫీల్డింగ్

భారత్‌తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడు టీ20ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. తొలి టీ20లో బంగ్లాదేశ్, రెండో టీ20లో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి టీ20 సిరీస్‌ దక్కనుండటంతో రెండు జట్లూ నువ్వా నేనా అని తలపడబోతున్నాయి.

భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మార్పు చేశాడు. కృనాల్‌ పాండ్యాని జట్టు నుంచి తప్పించి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇటీవల ముగిసిన రెండు టీ20ల్లోనూ కృనాల్‌ పాండ్య కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.

టీ20 రికార్డుల్లో బంగ్లాదేశ్‌‌పై టీమిండియాదే పైచేయిగా తెలుస్తోంది. ఇప్పటికే 10 టీ20ల్లో బంగ్లాదేశ్‌తో తలపడిన భారత్ జట్టు ఏకంగా 9 మ్యాచ్‌ల్లో విజయాల్ని అందుకుంది. అయితే.. తొలి టీ20లో అనూహ్య ఓటమి తర్వాత ఎలాంటి ఉదాసీనతకి తావివ్వకూడదని భావిస్తోంది.

Read More:

నాగ్‌పూర్ పిచ్‌పై యావరేజ్ స్కోరు 155‌కాగా.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ సార్లు గెలిచింది. ఎంతలా అంటే..? ఇప్పటి వరకూ ఈ స్టేడియంలో ఆడిన 11 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఎమినిది సార్లు గెలవగా.. ఛేదనకు దిగిన జట్టు గెలిచింది మూడు సార్లే. అయితే.. తాజా సిరీస్‌లో ముగిసిన రెండు టీ20ల్లోనూ ఛేదనకు దిగిన జట్టే గెలుపొందడం విశేషం.

Read More:

India (Playing XI): Rohit Sharma(c), Shikhar Dhawan, Lokesh Rahul, Shreyas Iyer, Manish Pandey, Rishabh Pant(w), Shivam Dube, Washington Sundar, Deepak Chahar, Yuzvendra Chahal, K Khaleel AhmedBangladesh (Playing XI): Liton Das, Mohammad Naim, Soumya Sarkar, Mushfiqur Rahim(w), Mahmudullah(c), Afif Hossain, Mohammad Mithun, Aminul Islam, Shafiul Islam, Mustafizur Rahman, Al-Amin Hossain

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.