భర్తను వదిలించుకునేందుకు స్నేహితుడితో పరార్.. వీడిన తెలుగు వైద్యుల మిస్సింగ్ మిస్టరీ

దేశ రాజధాని ఢిల్లీలో కనిపించకుండా పోయిన తెలుగు వైద్యుల ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దిలీప్, హిమబిందు సిక్కింలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియాతో పాటు వారి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టిన పోలీసులు ఐదు రోజుల తర్వాత వారిని వెతికి పట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీకి తీసుకొచ్చి ఇద్దరినీ విచారించనున్నారు. భర్త శ్రీధర్‌తో కలిసి ఉండటం ఇష్టంలేకే హిమబిందు ప్రియుడు దిలీప్‌తో వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:

శ్రీధర్, హిమబిందు, దిలీప్.. ముగ్గురూ కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ప్రస్తుతం శ్రీధర్, హిమబిందు ఢిల్లీలోనే డాక్టర్లుగా కొనసాగుతుండగా.. దిలీప్ ఛండీగఢ్‌లో ఉంటున్నాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన దిలీప్‌ను ట్రైన్ ఎక్కించేందుకు హిమబిందు డిసెంబర్ 25న రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. అప్పటి నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కంగారుపడిన శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు తప్ప మరే ఆధారాలు లభించలేదు.

Also Read:

మరోవైపు డాక్టర్ల మిస్సింగ్‌పై వెంటనే దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు కేంద్ర హోంశాఖను కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? అన్న కోణంలోనూ విచారించారు. చివరికి సోషల్‌మీడియా సాయంతో వారిద్దరు సిక్కింలో ఉన్నట్లు గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. భర్తను వదిలించుకోవాలన్న పక్కా ప్లాన్‌తోనే హిమబిందు తన స్నేహితుడైన దిలీప్‌తో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ రోజు వారిద్దరిని విచారించిన తర్వాత స్వస్థలాలకు పంపించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.