బాబోయ్.. మరీ అంత ఘోరంగానా.! డోస్ పెంచేసిన విజయసాయి

అధినేత చంద్రబాబుపై ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తుంటారు ఎంపీ విజయసాయి రెడ్డి. అందుకు దానికి ప్రతిగా తెలుగుదేశం నుంచి కూడా కొందరు నేతలు కౌంటర్ ఇస్తుంటారు. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు సాధారణమే అయినా.. మాత్రం ఈ మధ్య డోస్ బాగా పెంచేసినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు టార్గెట్‌గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయసాయి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

Also Read: దేశ ఆర్థిక వ్యవస్థపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 2.60 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టేశారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి నెలా ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఆర్బీఐ వద్ద బొచ్చె పట్టుకుని నిల్చునేవాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారని.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ప్రధానికి పాఠాలు చెప్తాడట! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా అమర్త్యాసేన్ అంటూ ఎద్దేవా చేశారు.

Read Also:

హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డు తన హయాంలో నిర్మించినట్లు చంద్రబాబు చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఔటర్ రింగ్ రోడ్డును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి చేశారని.. అది ముమ్మాటికీ ఆయన ఘనతేనన్నారు. రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించారని దుయ్యబట్టారు.

Also Read:

ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక మందితో చంద్రబాబు కేసులు వేయించారని ఎంపీ ఆరోపించారు. రోడ్డుకు అవసరమైన భూ సేకరణను అడ్డుకున్నాడన్నారు. న్యాయస్థానాలతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోరాడి రోడ్డు నిర్మాణాన్ని 90 శాతం పూర్తి చేశారని చెప్పారు. ఇప్పుడు 430 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్.. ఔటర్ రింగ్ రోడ్డు తానే నిర్మించానని కోతలు కోస్తున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.