ఫోన్‌తో ఫోటో తీసి పంపిస్తే.. ఉచితంగా ‘బంగారం’ గెలుచుకునే ఛాన్స్.. పూర్తి వివరాలు!

బంగారం కొనుగోలు చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ధర కొండెక్కి కూర్చొంది. రూ.40,000కు సమీపంలో కదలాడుతోంది. అయితే ఇప్పుడు మీకు ఉచితంగానే బంగారం గెలుచుకునే ఛాన్స్ అందుబాటులో ఉంది. అది కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఫోటో తీసి పంపిస్తే.. అది వారికి నచ్చితే మీకు బంగారం వచ్చినట్లే.

ఇక్కడ స్మార్ట్‌ఫోన్ ఉన్న వారందరికీ ఈ ఆఫర్ అందుబాటులో లేదు. ఆండ్రాయిడ్ యూజర్లకు నో ఆఫర్. కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రం ఇది వర్తిస్తుంది. ఐఫోన్ యూజర్లందరికీ బంగారం గెలుచుకునే ఛాన్స్ ఉంది. బంగారం మాత్రమే కాకుండా ఇతర బహుమతులు కూడా పొందొచ్చు.

Also Read:

ఐఫోన్ ఫోటోగ్రఫీ అవార్డు ఎంట్రీస్ ప్రారంభమయ్యాయి. ఇందుకు మీరు ఐఫోన్‌తో తీసిన ఫోటోలను పంపించొచ్చు. అయితే ఇక్కడ యూజర్లు కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. మీరు తీసిన ఫోటో ఎక్కడా కూడా పబ్లిష్ కాకూడదు. ఫోటో ఐఫోన్ లేదా ఐపాడ్‌తోనే తీసి ఉండాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌గ్రామ్‌లోని ఫోస్ట్‌లు కూడా అర్హత కలిగి ఉంటాయి.

Also Read:

ఫోటోషాప్‌ వంటి వాటిల్లో ఫోటోకు మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు. ఐఓఎస్ ఎడిట్ యాప్స్‌తో ఫోటోకు మార్పులు చేసే అవకాశం ఉంది. ఫోటో సైజ్ 1000 పిక్సెల్స్‌కు తగ్గకుండా ఉండాలి. 18 కేటగిరిలు ఉన్నాయి. మీరు నచ్చిన దానికి ఫోటోను ఎంట్రీ కోసం పంపొచ్చు.

Also Read:

18 కేటగిరిల్లో టాప్‌లో నిలిచిన ఫోటోలకు 18 బంగారు కడ్డీలను అందిస్తారు. 2, 3 స్థానాల్లో నిలిచి ఫోటోలకు పొలాడియా కడ్డీలను బహుమతిగా ఇస్తారు. ఐపీపీఏ ఫోటోగ్రాఫర్‌ ఆఫ్ ది ఇయర్‌కు ఐపాడ్ ఎయిర్ అందిస్తారు. టాప్ 3 విన్నర్లకు యాపిల్ వాచ్ సిరీస్ 3 లభిస్తాయి.

Also Read:

ఒక్కొక్కరు ఒక్క ఫోటో మాత్రమే కాకుండా ఎన్ని ఫోటోలైనా పంపొచ్చు. 25 ఫోటోల వరకు పంపించే ఛాన్స్ ఉంది. 2020 మార్చి 31 వరకు ఫోటోలు పంపొచ్చు. అయితే ఇక్కడ ఫోటోల ఎంట్రీ ఉచితం కాదు. ఒక్క ఫోటోకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.