పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కారుకు సుప్రీం కీలక ఆదేశాలు

స్టేటస్‌ రిపోర్టు, నిర్మాణ ఫొటోలను తమకు అందజేయాలని జగన్ సర్కారును ఆదేశించింది. ఒడిశా, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందని ఒడిశా తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ముంపు విషయంలో కనీస అధ్యయనం కూడా చేయలేదని ఒడిశా ఆరోపించింది.

మరోవైపు పోలవరం ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు లేవని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని, యథాతథంగా నిర్మాణం కొనసాగుతోందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయస్థానం.. కేసును రెండు వారాలపాటు వాయిదా వేసింది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.