పృథ్వీ షా 2.0 .. అభిమానులకి ఓపెనర్ హామీ..!

డోపింగ్ టెస్టులో ఫెయిలై ప్రస్తుతం నిషేధంలో ఉన్న భారత యువ ఓపెనర్ మళ్లీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ముస్తాక్ అలీ టీ20 సందర్భంగా పృథ్వీ షా మూత్ర నమూనాల్ని సేకరించిన జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా).. పరీక్షలు నిర్వహించగా అందులో టెర్బుటలైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీంతో.. ఈ యువ క్రికెటర్‌పై 8 నెలలు నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. నవంబరు 16కి ఆ నిషేధం గడువు ముగియనుంది.

Read More:

Read More:

నిషేధ సమయంలో కనీసం బీసీసీఐ కల్పించే సౌకర్యాల్ని వినియోగించుకునే అవకాశం కోల్పోయిన పృథ్వీ షా.. బ్యాటింగ్, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ కనబర్చినట్లు తెలుస్తోంది. శనివారం (నవంబరు 9) తన పుట్టిన రోజు సందర్భంగా పృథ్వీ షా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో పృథ్వీ షా 2.0 అంటూ రాసుకోవడం ద్వారా అభిమానులకి తాను రాటులేలినట్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

Read More:

2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. కానీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్‌కి ఎంపికై గాయం కారణంగా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండానే వెనుదిరిగాడు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.