పిల్లిగడ్డం, పూల చొక్కా‌లో బాలయ్య.. టీజర్ పోస్టర్‌లో గుర్తుపట్టడం కష్టమే

‘కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ’ అని బాలయ్య ఫ్యాన్స్ ఊరికే అంటారా? ఇదిగో ఇలాంటి లుక్స్ ఇస్తున్నందుకే బాలయ్య బాబుని సెక్సీ అంటున్నారు. తాజాగా ఆయన అప్ కమింగ్ మూవీ ‘రూలర్’కి సంబంధించింది ప్రమోషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో టీజర్ అంటూ.. బాలయ్య బాబు.. పిల్లిగడ్డం, పూల చొక్కాతో కళ్లకు కూలింగ్ గ్లాస్‌పెట్టి చేతులు చాపి స్లిప్ లుక్‌లో ‘కోకోకోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ’ అనేట్టుగా కొత్త అవతారం ఎత్తారు.

బాలయ్య ధరించిన కాస్ట్యూమ్స్ కూడా యంగ్ జనరేషన్ కుళ్లుకునేట్టుగానే ఉంది. సడెన్‌గా చూస్తే పోస్టర్‌లో ఉన్నది బాలయ్య అని గుర్తు పట్టడం కష్టమే. అంతలా మేకోవర్ కనిపిస్తుంది ఆయనలో. అయితే బాలయ్యకు సంబంధించి ఏ పోస్టర్ విడుదల చేసిన ట్రోలింగ్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో ఉండటం కామనే. ఈ పోస్టర్‌ని కూడా మీమ్స్‌కి వాడేస్తున్నారు నెటిజన్లు.

ఇక ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 105వ చిత్రం ‘రూల‌ర్‌’. సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. సి.క‌ల్యాణ్ నిర్మాత. ఈ చిత్రంలో రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ రెండు షేడ్స్‌కు సంబంధించిన బాల‌కృష్ణ లుక్స్‌ను చిత్ర యూనిట్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. వీటికి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో బాల‌కృష్ణ చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా క‌న‌ప‌డుతున్నారు. ప‌ర్టికుల‌ర్‌గా ఈ లుక్ కోసం బాల‌కృష్ణ బ‌రువు కూడా త‌గ్గారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పుడు మున్నార్‌లో ఓ మెలోడి సాంగ్‌ను బాల‌కృష్ణ‌, వేదిక‌ల‌పై చిత్రీక‌రిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న విడుద‌ల చేయ‌బోతున్నారు.

`జైసింహా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ఇదే కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.