పబ్బు పేరుతో గబ్బు పనులు.. జూబ్లీహిల్స్ రేవ్‌ పార్టీ ఉదంతంలో సంచలనాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్ 10లోని ఓ పబ్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఏఐ (టాట్‌) పబ్‌లో ఆదివారం రాత్రి రేవ్‌ పార్టీ నిర్వహించింది ప్రసాద్‌, శ్రీనివాసనాయుడులుగా గుర్తించారు. రేవ్ పార్టీలో నగ్న డాన్సులు వేయించేందుకు పశ్చిమ్‌ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 21 మంది యువతులను తీసుకొచ్చినట్లు తెలిసింది.

Also Read:

యువతులతో నగ్న నృత్యాలు చేయించేందుకు సిద్ధం కాగా, పక్కా సమాచారం అందుకున్న తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారులు మొదట తనిఖీలు నిర్వహించి వెళ్లారు. తర్వాత ఇంకెవరూ రారని భావించిన నిర్వాహకులు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు. దీంతో బంజారాహిల్స్‌ డివిజన్‌ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 21 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి సినిమా అవకాశాల కోసం వచ్చిన యువతులు ఈ రొంపిలోకి దిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Also Read:

అయితే పబ్బు యజమానులు సంతోష్‌రెడ్డి, భరత్‌, కార్యక్రమం నిర్వాహకులు ప్రసాద్‌, శ్రీనివాస్‌నాయుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఓ విత్తన సంస్థ కోసం ఏర్పాటు చేశారని హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎఫ్‌ఏఐ పబ్బును మూసివేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, సికింద్రాబాద్‌ ఆర్డీఓలకు జూబ్లీహిల్స్‌ పోలీసులు లేఖలు రాశారు. దీంతో పాటు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లిస్బాన్‌ పబ్‌ను కూడా మూసివేయించనున్నట్లు డీసీపీ వెల్లడించారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.