పన్ను చెల్లింపుదారులకు మోదీ శుభవార్త.. కొత్త సేవలు అందుబాటులోకి!

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) విశిష్ట డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం వంటివి పెరగనున్నాయి.

ఇప్పుడు వస్తు సేవల పన్ను (GST), కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వంటి పన్నులు చెల్లించేవారు వారి ట్యాక్స్ నోటీసులను ఒకటికి రెండుసార్తు సరిచూసుకోవచ్చు. దీంతో పన్ను నోటీసులు నిజమో కాదో తెలుసుకోవచ్చు. మెమో సెర్చ్ ఫెసిలిటీ కూడా ఉంది. తొలిగా ఈ సేవలు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు అందుబాటులోకి వస్తాయి.

సెర్చ్ అండ్ అరెస్ట్ నోటీసులు వంటి ఇన్వెస్టిగేషన్ సంబంధిత అంశాల కోసం తొలిగా ఈ విశిష్ట డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (CBIC-DIN)ను ఉపయోగిస్తారు. ఈ ఏడాది చివరకు ఇతర అంశాలకు కూడా ఈ సేవలను విస్తరిస్తారు. డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌పేయర్స్‌కు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Also Read:

‘నవంబర్ 8 లేదా ఆపైన విడుదల అయ్యే నోటీసులపై కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకపోతే అవి చెల్లుబాటుల కావు’ అని సీబీఐసీ తెలిపింది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) అమలులోకి రావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుదారులు వారికి వచ్చే నోటీసులు నిజమో కాదో తెలుసుకోవచ్చని పేర్కొంది.

Also Read:

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు () ఇప్పటికే డీఐఎన్ విధానాన్ని అమలు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఇకపోతే సీబీఐసీ డీఐఎన్ అమలుకు సంబంధించి ప్రిన్సిపల్ కమిషనర్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్స్, చీఫ్ కమిషనర్స్, డైరెక్టర్ జనరల్స్, ప్రిన్సిపల్ కమిషనర్స్, ప్రిన్సిపల్ ఏడీజీ, జాయింట్ సెక్రటరీస్, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read:

నిజాయితీతో పన్ను చెల్లించే వారిని ట్యాక్స్ అధికారుల వేధింపుల నుంచి రక్షించేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. సీబీడీటీ, సీబీఐసీ నుంచి వెలువడే అన్ని డాక్యుమెంట్లకు కచ్చితమైన ఆడిట్ ట్రయల్ ఉంటుంది. అంటే సీబీఐసీ డీఐఎన్‌లో 20 నెంబర్లు ఉంటాయి. డాక్యుమెంట్‌పై ఇది కనిపిస్తుంది. సీబీడీటీ డీఐఎన్‌లో 10 నెంబర్లు ఉంటాయి.

Also Read:

కేవలం అధీకృత అధికారులు మాత్రమే సీబీడీటీ డీఐఎన్, సీబీఐసీ డీఐఎన్ నెంబ్లను జనరేట్ చేయగలరు. నవంబర్ 8 నుంచి సీబీఐసీ డీఐఎన్ నెంబర్ అమలులోకి వచ్చింది. ఇక సీబీడీటీ డీఐఎన్ నెంబర్ విధనం అక్టోబర్ 1 నుంచే అమలులో ఉంది.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.