న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం పెంచే తీర్పిది: మోదీ

వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర హర్షం వ్యక్తం చేశారు. దీన్ని ఏ ఒక్కరి విజయమో, అపజయమో అని చూడకూడదన్నారు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న సమస్యకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన పరిష్కారం చూపించిందని అభిప్రాయపడ్డారు.

Also Read:

రామ్ భక్తి అయినా, రహీమ్ భక్తి అయినా.. దేశ ప్రజలంతా దేశభక్తిని బలోపేతం చేసుకోవాల్సిన సమయమిదని మోదీ అన్నారు. ఎలాంటి వివాదాన్ని అయినా మన న్యాయ వ్యవస్థ సామరస్యంగా, స్నేహపూర్వకంగా పరిష్కరిస్తుందని మరోసారి తేటతెల్లమైందన్నారు. ఇది మన న్యాయవ్యవస్థ యొక్క స్వేచ్ఛ, పారదర్శకత మరియు దూరదృష్టిని పునరుద్ఘాటిస్తోందన్నారు.

Also Read:

సుప్రీం తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 130కోట్ల మంది ప్రజలు పాటిస్తున్న సంయమనం శాంతి కోసం ప్రజలు కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాంటూ మోదీ ట్విటర్ ద్వారా తన స్పందనను వెల్లడించారు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.