నేను చచ్చిపోతున్నా.. కలకలం రేపుతున్న దివ్యాంగుడి వీడియో..

అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఏం చేయాలో దిక్కుతోచక ఓ దివ్యాంగుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. తాను చనిపోతూ తీసుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. తన వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేదని చెబుతూ ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగి.. పురుగుమందు తాగేసిన వీడియో సంచలనంగా మారింది.

మార్కెట్ యార్డులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దివ్యాంగుడు అబ్దుల్ రజాక్ పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. నిద్రమాత్రలు మింగి.. పురుగుల మందు తాగేశాడు. అదంతా వీడియో షూట్ చేయడం సంచలనమైంది. తనకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదని.. తన చావుకు ఫలానా వారు కారణమంటూ వీడియో తీశాడు.

Also Read:

అకారణంగా ఉద్యోగం నుంచి తీసేసి తన పొట్టకొట్టారని.. వికలాంగుడినన్న కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వల్ల ఎవ్వరికీ ఉపమోగం లేదని.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేదని చెప్పాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమని చెబుతూ ఒక్కసారిగా నిద్రమాత్రలు మింగేసి వెంటనే పురుగుల మందు తాగేశాడు. ఆ వీడియో వైరల్ అవడంతో ఒక్కసారిగా తెనాలి అలజడి రేగింది. అయితే అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అబ్డుల్ రజాక్ సహా కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జూన్‌లోనే ఉద్యోగాల నుంచి తొలగించినట్లు సమాచారం. అన్నిమార్కెట్ యార్డుల్లో గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాల నుంచి తీసివేసే తంతు కొనసాగుతోందని.. వైఎస్సార్సీపీ అనుయాయులకు ఇచ్చుకునేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు నెలలుగా ఖాళీగా ఉండడం.. అప్పుల భారం ఎక్కువవడంతో ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది.

Read Also:

అబ్దుల్ రజాక్ ఆత్మహత్యా యత్నంపై రాజకీయ దుమారం రేగుతోంది. అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తీసివేసే సంస్కృతిని ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత నారా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం ఉన్నవాళ్లని ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. రజాక్ ఆత్మహత్యకు పాల్పడుతున్న వీడియోను ట్వీట్ చేస్తూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.