నేను అబ్బాయిల్ని ముద్దు పెట్టుకోను:Bigg Bossలో ప్రియాంక గాంధీ మరిది రచ్చ

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 13 షో రసవత్తరంగా సాగుతోంది. పలువురు బుల్లితెర నటులతో పాటు ఈ షోలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మరిది కూడా పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా టెహ్సీన్‌కి ‘చిన్నారి పెళ్లికూతరు’ ఫేం సిద్ధార్థ్ శుక్లాకి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. దాంతో సిద్ధార్థ్ కోపం కంట్రోల్ చేసుకోలేక.. ‘ఏంటి టెహ్సీన్ నన్ను ముద్దుపెట్టుకుంటావా?’ అని అడిగాడు. ఇందుకు టెహ్సీన్ స్పందిస్తూ.. ‘నేను అబ్బాయిల్ని ముద్దుపెట్టుకోను. సిగరెట్ల కంపు కొడుతుంది. నా ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి’ అన్నాడు.

అయితే సిద్ధార్థ్ అక్కడితో ఆగలేదు. ‘కానీ నువ్వు చేసే పనులకు మాటలకు సంబంధం లేదు. నువ్వు రాజకీయ నాయకుడివి అవుతావా?’ అంటూ టెహ్సీన్ స్వలింగ సంపర్కుడని ఇన్ డైరెక్ట్‌గా ఎగతాళి చేశాడు. టెహ్సీన్ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సోదరుడు. ఇతను కాంగ్రెస్‌కు పొలిటికల్ ఎనలిస్ట్‌గా పనిచేసేవాడు. అయితే ఆయన బిగ్ బాస్ షోలోకి ఎలా వచ్చాడో మాత్రం అర్థంకావడంలేదు. అయితే ఇదివరకు సీజన్స్‌తో పోలిస్తే ఈ బిగ్ బాస్ సీజన్‌కు అంత పాపులారిటీ రావడంలేదు. కంటెస్టెంట్లు సరిగ్గా ఆడటం లేదని సల్మాన్ ఖాన్‌కు కోపం వచ్చింది.

దాంతో స్టేజ్‌పై సూట్ తీసి పడేసి నేను బిగ్ బాస్ చేయను, కావాలంటే వేరే వాడితో చేయించుకోండి అంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు, షో నిర్వాహకులు సల్మాన్‌ను వేడుకోవడంతో ఆయన మళ్లీ షోలోకి రావడానికి ఒప్పుకొన్నారు. అదీకాకుండా షోలోని కంటెస్టెంట్లలో అమ్మాయి, అబ్బాయి ఒకే బెడ్‌పైన పడుకోవడం కూడా వివాదాస్పదమైంది. ఈ షో రోజూ ప్రైమ్ టైంలో ప్రసారం అవుతుందని, ఆ టైంలో ఫ్యామిలీలు కూడా టీవీ చూస్తుంటాయని చాలా మంది ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ షోలా కాకుండా పోర్న్ షోలా బిగ్ బాస్‌ను మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్ం చేస్తున్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.