నెటిజెన్‌ డ్యాన్స్‌కు ఫిదా అయిన హృతిక్.. ఎవరో చెప్పాలంటూ ట్వీట్

బాలీవుడ్‌ మ్యాన్లీ హీరో డ్యాన్స్‌కు ఫ్యాన్‌ కానీ సినీ ప్రేమికుడు ఉండడు. హృతిక్ సినిమా రిలీజ్‌ అవుతుందటే ఆయన డ్యాన్స్‌, ఫైట్స్ చూసేందుకు అభిమానులు ఎగబడతారు. తొలి సినిమా నుంచే తన డ్యాన్స్‌తో కోట్ల మందిని అభిమానులుగా మార్చేసుకున్న హృతిక్‌ కూడా ఓ వ్యక్తి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయాడు. ఎయిర్‌ వాకర్‌ స్టైల్‌లో చేసిన ఆ డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూస్తే మైఖేల్‌ జాక్సన్‌ను చూస్తున్నట్టే ఉంది.

ఈ కుర్రాడి డ్యాన్స్‌ వీడియోను షాశ్‌ (Shash) అనే వ్యక్తి తన ట్విటర్‌ పేజ్‌లో షేర్‌ చేస్తూ హృతిక్‌ రోఫన్‌, ప్రభుదేవాలకు ట్యాగ్ చేశాడు. అంతేకాదు ఆ యువ డ్యాన్సర్‌ను పాపులర్ చేయాలని కోరాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన హృతిక్‌ రోషన్‌ ఇంత స్మూత్‌గా ఎయిర్‌ వాక్‌ చేయటం చూడటం ఇదే మొదటిసారని తెలిపాడు.

Also Read:

అంతేకాదు అసలు ఈ వ్యక్తి ఎవరు అంటూ తనకు ట్యాగ్ చేసిన వ్యక్తిని ప్రశ్నించాడు హృతిక్‌. కేవలం హృతిక్‌ మాత్రమే కాదు ఈ కుర్రాడి డ్యాన్స్‌కు బిగ్ బి కూడా ఫిదా అయ్యాడు. అనసూయ, సునీల్ శెట్టి, అనుపమ్‌ ఖేర్‌ లాంటి స్టార్స్‌ కూడా ఈ వ్యక్తి డ్యాన్స్ వీడియోను షేర్‌ చేశారు.

మైఖేల్‌ జాక్సన్‌ అభిమాని అయిన ఈ వ్యక్తి తన పేరును బాబా జాక్సన్‌ 2020 అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి అసలు పేరు యువరాజ్‌ సింగ్ అని, సోషల్ మీడియాలో ఎంతో పాపులర్‌ అయిన ఆ వ్యక్తికి ట్విక్‌ టాక్‌ దాదాపు పది లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారని తెలిసింది. అయితే ఏకంగా హృతిక్‌ లాంటి టాప్‌ స్టార్‌ ఆ వ్యక్తి గురించి ఆరా తీస్తుండటంతో అతడి దశ తిరిగినట్టే అంటున్నారు నెటిజెన్లు.

Also Read:

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.