‘నివేదా నువ్వు వర్జినేనా?’.. ఫ్యాన్స్ అసభ్యకర ప్రశ్నలు

తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌డం సంపాదించుకున్న నటి . ప్రస్తుతం ఆమె ‘దర్బార్’ సినిమాలో నటిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురి పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాసేపు సరదాగా ఫ్యాన్స్‌తో ముచ్చిటిద్దామనుకున్నారు నివేదా. ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ సెషన్‌లో పాల్గొన్నారు. దాదాపుగా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ నివేదా సమాధానం చెప్పారు. అయితే కొందరు మాత్రం అసభ్యకరమైన ప్రశ్నలు అడిగి ఆమెను ఇబ్బందిపెట్టారట. ఈ విషయాన్ని నివేదా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘నాతో చాట్ చేయడానికి సమయం కేటాయించినందుకు అందరికీ థ్యాంక్స్. మీరు అడిగిన ఫన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చాలా ఎంజాయ్ చేశాను. అయితే నేను కొందరు అడిగిన ప్రశ్నలను పట్టించుకోలేదు. చాలా మంది పెళ్లెప్పుడు, ఒక్క మాటలో చెప్పండి, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా, మీరు వర్జినా కాదా.. వంటి దరిద్రమై ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పలేదు. మీరు మాట్లాడేది కూడా ఓ మనిషితోనేనని తెలుసుకోండి. ఇతరులకు మర్యాద ఇవ్వండి. ఏదేమైనా మీతో చాట్ సెషన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనే ఇటీవల నటి రష్మిక మందనకు ఎదురైంది. ఆమె తన చిన్ననాటి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ చేసే ఓ నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ వాటిపై ‘ఇంత చిన్న పిల్ల పెద్దై ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు’ అని కామెంట్ చేశాడు. అంతేకాదు ‘f**k’ అన్న పదాన్ని కూడా వాడి పిచ్చిగా క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్తా రష్మిక కంట పడింది. దాంతో ఆమె నొచ్చుకున్నారు. వెంటనే అతనికి బుద్ధి చెప్పారు.

2016లో వచ్చిన ‘జెంటిల్‌మెన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నివేదా. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘జైలవకుశ’, ‘118’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నిఖిల్‌కి జోడీగా ‘శ్వాస’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు నాని, సుధీర్ కథానాయకులుగా నటిస్తున్న ‘v’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.